రష్యాకు పెద్ద మొత్తంలో సైనికులను ఉత్తరకొరియా తరలిస్తున్నట్లు దక్షిణ కొరియా ఆరోపిస్తోంది. అయితే ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్ధతుగా ఉత్తర కొరియా ఈ పనిచేస్తోంది. దీంతో ఉత్తర కొరియా బలగాలకు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బరిలోకి దిగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: ఉదయం పూట తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే!
బరిలోకి దిగేముందు ఒకటికి రెండుసార్లు..
రష్యాకు మద్దతిస్తూ ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశిస్తే వారి బాడీలు బ్యాగ్‌లలో తిరిగివెళ్తాయని అమెరికా హెచ్చరించింది. కాబట్టి బరిలోకి దిగేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. అయితే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు పెట్టి మరి వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చూడండి: గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కారణమేంటంటే?
ఇదిలా ఉండగా.. మాస్కోకు ఉత్తర కొరియా బలగాలు పంపడంపై రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ఐక్యరాజ్య సమితిలో ప్రశ్నించారు. కిమ్‌కు పాశ్చాత్య దేశాలు సాయం అందిస్తున్నప్పుడు మాస్కోకు మిత్రదేశాలు ఉత్తరకొరియా సహాయం అందించకూడదా అని ప్రశ్నించారు. జెలెన్‌స్కీకి సాయం హక్కు అమెరికాకి ఉన్నప్పుడు.. రష్యాకు సాయం హక్కు కూడా వాటి మిత్రదేశాలకు ఉంటుందని రష్యా రాయబారి అన్నారు.
ఇది కూడా చూడండి: బాణసంచా తయారీపై పిడుగు.. ఇద్దరు మృతి
ఈ వ్యాఖ్యలపై ఐక్యరాజ్య సమితి రాయబారి సెర్గీ కిస్లిట్యా స్పందించారు. ఉక్రెయిన్‌కు సహాయం అందించే దేశాలు భద్రతామండలి ఆంక్షలను ఉల్లంఘించలేదని తెలిపారు. రష్యాకు తమ దళాలను పంపుతున్నట్లు ఉత్తరకొరియా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇలాంటివి పాటిస్తే అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉంటుందని తెలిపింది. అమెరికా, పాశ్చాత్య దేశాల రష్యా సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలు బహిర్గతం చేయడం, బెదిరింపులకు పాల్పడితే.. తప్పకుండా మేం కూడా చర్యలు తీసుకుంటామని ఉత్తర కొరియా రాయబారి సాంగ్ కిమ్ కౌన్సిల్ స్పందించినట్లు కూడా తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: దీపావళి జరుపుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!