/rtv/media/media_files/2025/06/17/U2l683rgXMmm7riWZF9b.jpg)
Air India flight Technical issue
జూన్ 21 నుంచి జూలై 15 వరకూ ఎయిర్ ఇండియా విమాన సంస్థ 16 అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను తగ్గిస్తున్నామని ప్రకటించింది. 3 విదేశీ గమ్యస్థానాలను నిలిపివేస్తున్నామని ఎయిరిండియా గురువారం ప్రకటించింది. జూన్ 12న అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తర్వాత పలు విమాన సర్వీసులలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ మళ్లీ సెట్ చేయడానికి కొంత టైం పడుతుందని టాటా గ్రూపు యాజమాన్యంలోని ఎయిరిండియా పేర్కొంది. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియాలోని నగరాలను కలిపే 16 అంతర్జాతీయ మార్గాలలో కూడా విమాన సర్వీసులను తగ్గనున్నట్లు ఎయిరిండియా తెలిపింది.
Here's the full list of affected flights, shared by Air India 👇 https://t.co/wmG3jxscdxpic.twitter.com/GkxkXE1SG3
— The Indian Aviation Guy 🇮🇳 (@TIAG747) June 19, 2025
భారీ సైజు విమానాలతో నిర్వహించే సర్వీసులను 15 శాతం తగ్గించనున్నట్లు తెలిపింది. జూన్ 21న ప్రారంభమై జూలై 15న ఈ విమాన సర్వీసు తగ్గింపులు ముగుస్తాయని ఎయిరిండియా పేర్కొంది. ఢిల్లీ -నైరోబి, అమృత్‌సర్-లండన్(గాత్విక్), గోవా(మోపా)-లండన్(గాత్విక్) మధ్య విమాన సర్వీసులు జూలై 15 వరకు నిలిపివేస్తున్నట్లు వివరించింది.