/rtv/media/media_files/2025/06/13/recF6JkHqO2HTsotsQ3Q.jpg)
Ahmedabad plane crash
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘోర ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటు 29 మంది మెడికల్ కాలేజ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే సరిగ్గా ఈ ప్రమాదం జరిగిన సమయం నుంచి ఫిల్మ్ మేకర్ మహేష్ కళావడియా ( film maker Mahesh Kalawadia) కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. నరోడాకు చెందిన మహేష్ కళావడియా అలియాస్ మహేష్ జిరావాలా మ్యూజిక్ ఆల్బమ్ దర్శకుడిగా పనిచేస్తున్నారు.
డైరెక్టర్ మిస్సింగ్!
అయితే గురువారం మధ్యాహ్నం 1:39 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్దిసేపటికే మేఘానినగర్‌లోని మెడికల్ కాలేజ్ క్యాంపస్‌లో కూలిపోయింది. కాగా, అదేరోజు మధ్యాహ్నం మహేష్ ఘటన స్థలానికి సమీపంలోని 'లా గార్డెన్' ప్రాంతంలో ఒకరిని కలవడానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
భార్య హేతల్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్ మధ్యాహ్నం 1:14 గంటలకు ఫోన్ చేసి మీటింగ్ పూర్తయిందని, ఇంటికి బయలుదేరానని భార్యకు చెప్పారట. చాలా సమయం అయినప్పటికీ మహేష్ తిరిగి రాకపోవడంతో భార్య హేతల్ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది.
#AhmedabadPlaneCrash: गुजरात से एक मशहूर फिल्म निर्माता के गायब होने से हड़कंप मच गया है। फिल्मकार के पिछले हफ्ते 12 जून को लापता होने और उनके मोबाइल फोन की लास्ट लोकेशन एयर इंडिया विमान दुर्घटना स्थल से महज 700 मीटर दूर पाए जाने के बाद उनके परिवार ने भी DNA सैंपल सौंपे हैं...… pic.twitter.com/lYgtPksIL8
— Moneycontrol Hindi (@MoneycontrolH) June 16, 2025
మహేష్ కోసం డీఎన్‌ఏ టెస్ట్
దీంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైన ఆమె.. పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీస్ అధికారులు దర్యాప్తు చేయగా.. మహేష్ చివరి ఫోన్ లొకేషన్ ప్రమాద స్థలానికి దాదాపు 700 మీటర్ల దూరంలో ఉన్నట్లు తేలింది. అతడి ఫోన్ సరిగ్గా 1:40 గంటలకు స్విచ్ ఆఫ్ అయింది (విమానం టేకాఫ్ అయిన నిమిషం తర్వాత). అలాగే ఆయన స్కూటర్, మొబైల్ ఫోన్ కూడా కనిపించడం లేదని తెలిసింది. దీంతో ప్రమాదంలో నేలమీద మరణించిన వారిలో ఆయన కూడా ఉన్నారేమో అని నిర్ధారించుకోవడానికి కుటుంబ సభ్యులు డీఎన్‌ఏ నమూనాలను అందించారు.
Also Read: ఎంత మూర్కుడివిరా నీవు....భార్యను బాల్కనీ రెయిలింగ్‌కు వేలాడదీసిన భర్త