లాస్ ఏంజెలెల్స్‌లో వర్షం.. కార్చిచ్చు నుంచి ఉపశపనం

లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు వర్షం కురిసింది. శనివారం రాత్రి దక్షణ కాలిఫోర్నియాలో వర్షం కురిసింది. లాస్ ఏంజెలెస్ లో కూడా మూడు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అది అక్కడి ప్రజలకు ఉపశమనం. ఇక కొత్త మంటలు చెలరేగవని అనుకుంటున్నారు.

New Update
rain in Los Angeles

rain in Los Angeles Photograph: (rain in Los Angeles)

అమెరికా లాస్ ఏంజెలెస్ కార్చిచ్చుతో భారీ నష్టం సంభవించింది. పూర్తిగా దగ్ధమైపోయిన అడవులు, భవనాలు ప్రస్తుతం బూడిదతో కప్పిఉన్నాయి. అక్కడక్కడ ఇంకా మంటలు రగుతున్నాయి. వాటిని అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. ఈక్రమంలో వరుణదేవుడు కరుణించాడు. కార్చిచ్చు తర్వాత దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం వర్షం కురిసింది. ఇది దక్షిణ కాలిఫోర్నియాలో ఈ సీజన్‌లోనే తొలి వర్షం. దీంతో అక్కడి ప్రజలకు ఉపశపనం లభించింది.

Read also ; 150 కేజీల పువ్వు.. దీని దుర్వాసన అస్సలు భరించలేం: వీడియోలు చూశారా!

కొత్త ప్రదేశాల్లో మంటలు చెలరేగడం ఆగిపోతుందని వారు భావిస్తున్నారు. లాస్ ఏంజెలెస్‌లో కూడా వర్షం కురవనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరో మూడు రోజులు చిన్నపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో వైపు కొండప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవిస్తే కాలిపోయిన శిథిలాలు, బూడిద దిగుల ప్రాంతాల్లో నగరాలను ముంచెత్తే ప్రమాదం ఉందని.. అలాంటిది జరిగినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలని నేషలన్ వెదర్ సర్వీస్ వెల్లడించింది. కాలిపోయిన కొండప్రాంతాల నుంచి వచ్చే విషపూరితమైన బూడిద కొత్త సమస్యలను తెచ్చిపెడుతుందని లాస్‌ ఏంజెలెస్ ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. 

Also Read: పాకిస్థాన్ జైల్లో భారతీయ ఖైదీ మృతి.. శిక్షా కాలం పూర్తయినప్పటికీ.. !

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు