/rtv/media/media_files/2025/11/28/fotojet-2025-11-28t083807290-2025-11-28-08-38-43.jpg)
Hyderabadi biryani
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఇక్కడి బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా10వ స్థానం దక్కింది. హైదరాబాదీ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే.హైదరాబాద్ బిర్యానిని ఆరగించేందుకు భోజన ప్రియులు తహతహలాడుతుంటారు. అలాంటి బిర్యానీ ప్రపంచ అత్యుత్తమ రైస్ డిష్‌లలో టాప్ 10లో చోటు దక్కించుకుంది. ‘వరల్డ్స్ బెస్ట్ రైస్ డిషెస్ లిస్ట్ ఆఫ్ 2025’ పేరుతో ఆన్‌లైన్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఒక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో హైదరాబాదీ బిర్యానీ 10వ స్థానంలో నిలవడమే కాదు.. ఈ జాబితాలో ఎంపికైన టాప్ 50 డిషెస్‌లో కూడా ఇండియా నుంచి ఎంపికైన ఒకే ఒక్క డిష్ బిర్యానీ కావడం విశేషం. చెఫ్‌లు, ఫుడ్ క్రిటిక్స్ చేసిన సమీక్షలతో పాటుగా యాత్రికులు అందించిన రేటింగ్స్ ద్వారా హైదరాబాదీ బిర్యానీని టాప్10 రైస్ డిష్‌గా ఎంపిక చేశారు.
కాగా టాప్ టెన్‌లో నిలిచిన జాబితాలో అధిక శాతం జపనీస్ వంటకాలే ఉండటం విశేషం. కాగా, టాప్ 10లో మొదటి మూడు డిషెస్ జపనీస్ వంటకాలే కావడం గమనార్హం. అవి నెగిటోరోడాన్, సుషీ, కైసెన్డాన్‌లు. ఇక ఇండియాలో లక్నో, కశ్మీరీ, కోల్‌కతా.. విభిన్న ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక బిర్యానీలు ఉన్నప్పటికీ హైదరాబాదీ బిర్యానీ అగ్రగామిగా నిలవడం గమనార్హం. మరో విశేషమేమిటంటే టాప్ 50లో బిర్యానీ పేరిట నిలిచిన మరో వంటకం ఇరాన్‌కు చెందినది కావడం గమనార్హం.
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో బిర్యానీలు ఉన్నప్పటికీ హైదరాబాద్ బిర్యానీ దేశంలోని ఇతర ప్రాంతాలలో తయారయ్యే బిర్యానీలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో మాంసం, బియ్యాన్ని మసాలాలతో కలిపి ఒకేసారి వండటం ప్రత్యేకత. దీనిని కచ్చి బిర్యానీగా పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన విధానమే దీని రుచికి మూలం అని తెలుస్తోంది. ఇక మరో విధానం పక్కి బిర్యానీ. ఇందులో ముందుగా మసాలాలతో మాంసం వేరు, బియ్యం వేరు ఉడికించి, ఆ తర్వాత వాటిని పొరలుగా అమర్చిన తరువాత ‘దమ్’ మీద ఉంచి వండుతారు. ఈ విధానం కొద్ది సమయంలో సిద్ధమయ్యే తేడాతో పాటు బిర్యానీకి ప్రత్యేకమైన, స్పష్టమైన రుచులను ఇస్తుంది.
హైదరాబాద్ కా బాద్షా..
హైదరాబాద్ బిర్యానీ అనేది హైదరాబాద్ నుండి ఉద్భవించిన ఒక ప్రసిద్ధ వంటకం, ఇది బాస్మతి బియ్యం, మాంసం (మేక మాంసం ఎక్కువగా), పెరుగు ,మసాలాలతో తయారు చేస్తారు. ఇది నిజాం నవాబుల వంటశాలలలో పుట్టింది. నిజానికి ఇది మొఘలాయ్,హైదరాబాదీ వంటకాల మిశ్రమం. బిర్యానీ పరిచయం చేసినప్పుడు మొఘల్ సామ్రాజ్యం పాలనలో ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్వాధీనంలో దక్షిణ భారతదేశం ఉంది. " బిర్యానీ" అనే పదం పెర్షియన్ భాష నుండి వచ్చింది .పెర్షియన్ భాషలో వేయించిన లేదా కాల్చిన నుండి వచ్చినదే బిర్యానీ అనే పదం.
తయారీ విధానం: దీనిని ముఖ్యంగా కచ్చి (కచ్చా యఖ్ని) పద్ధతిలో వండుతారు. దీనిలో మాంసాన్ని మసాలా దినుసులతో ముందుగా మ్యారినేట్ చేసి, ఆపై బియ్యంతో పొరలు పొరలుగా వేసి నెమ్మదిగా ఉడికిస్తారు.
ప్రధాన పదార్థాలు: బాస్మతి బియ్యం, మేక మాంసం లేదా చికెన్, ఉల్లిపాయలు, పెరుగు, మరియు వివిధ సుగంధ ద్రవ్యాలు దీని ప్రధాన పదార్థాలు.
ప్రాముఖ్యత: ఇది హైదరాబాద్ నగరానికి పర్యాయపదంగా పరిగణించబడుతుంది, ఇది హైదరాబాదీ వంటకాలకు కేంద్ర బిందువుగా ఉంది.
ప్రపంచ గుర్తింపు: "టెస్ట్ అట్లస్" అనే వెబ్‌సైట్ విడుదల చేసిన ప్రపంచంలోని ఉత్తమ బియ్యం వంటకాల జాబితాలో హైదరాబాద్ బిర్యానీ 10వ స్థానం సంపాదించుకుంది.
పలు రకాలు: చికెన్, మటన్ మరియు వెజ్ దమ్ బిర్యానీ వంటి అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి.
Follow Us