Bangladesh: అబ్బా దారుణం..8ఏళ్ళ బాలిక రేప్.. గుండెపోటుతో మృతి!

ముక్కుపచ్చలారని వయసులో బంధువులే కాలనాగులై కాటు వేశారు. 8 ఏళ్ళ వయసులో మూడు సార్లు గుండె పోటు వచ్చి చనిపోయేలా చేశారు. సొంత అక్క భర్త, మరిది మామ కలిసి చిన్నారి జీవితాన్ని పొట్టన పెట్టుకున్నారు. బంగ్లాదేశ్ లో జరిగిన ఈ ఘటన కంటతడి పెట్టిస్తోంది. 

New Update
kerala rape case

kerala rape case Photograph: (kerala rape case)

బంగ్లాదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ 8 ఏళ్ళ చిన్నారిపై ఆమె అక్క మెట్టినింటి వారే బలాత్కారానికి పాల్పడ్డారు. అక్క భర్త, మరిది, మామల్లో ఒకరు ఈ దారుణానికి ఒడిగట్టారు. దీంతో చిన్నారి తీవ్ర గాయాలపాలై.. ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఆ తరువాత జరిగిన ఘటనను తలుచుకుని బాలిక చాలా భయపడిపోయింది.

మానసికంగా కుంగిపోయి..

ఓవైపు శారీరక గాయాలతో బాధ పడుతున్న బాలిక.. తనకు జరిగిన దారుణాన్ని తలచుకుని మానసికంగా కుంగిపోయింది. దీంతో చిన్నారికి 3సార్లు గుండెపోటు వచ్చింది. మొదటి రెండు సార్లు పాపను డాక్టర్లు కాపాడారు. కానీ మూడోసారి మాత్రం ఏం చేయలేకపోయారు. మార్చి 8 తరువాత ఐదు రోజులు ఆసుపత్రిలో చావు బతుకులతో పోరాడిన పాప చివరకు మార్చి 13న చనిపోయింది.  చిన్నారి మృతి బంగ్లాదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. నిందితులు ఎవరో వెంటనే కనిపెట్టి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

బంగ్లాదేశ్ మగురా నగరంలో ఈ సంఘటన జరిగింది. మార్చి 8వ తేదీన రోజు రాత్రి చిన్నారి తన అక్క దగ్గరకు వెళ్ళింది. కానీ మర్నాడు తన అక్క ఇంటికి కొంచెం దూరంలో అపస్మారక స్థితిలో పడి కనిపించింది. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి, అక్క వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు చెప్పగా అత్యాచారంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక అక్క భర్త, అతని సోదరుడు, తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. 

Also Read: Podcost: ప్రధాని మోదీతో ఫ్రిడ్ మన్ ఎపిక్ పాడ్ కాస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు