Cinema: అయ్యో.. మహేష్ నో చెప్పాడు.. బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టాడు! ఆ సినిమా ఏంటో తెలుసా?

ఒక హీరో నో చెప్పిన కథ.. మరో హీరోకు బ్లాక్ బస్టర్ హిట్టయిన సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆయన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్నారు.

New Update

Cinema: ఒక హీరో నో చెప్పిన కథ.. మరో హీరోకు బ్లాక్ బస్టర్ హిట్టయిన సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆయన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్నారు. మహేష్ వదులుకున్న ఆ సినిమా అల్లు అర్జున్ చేసి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు. ఆ సూపర్ హిట్ సినిమా మరేదో కాదు.. రేసు గుర్రం! డైరెక్టర్ సురేందర్ రెడ్డి  ముందుగా రేసుగుర్రం కథను మహేష్ బాబుకు వినిపించారట. ఆయనను దృష్టిలో పెట్టుకునే హీరో పాత్రను కూడా డిజైన్ చేశారట. కానీ ఆ సమయంలో ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా  అడిగారు టైం కావాలని అడిగారంట మహేష్ బాబు. దీంతో డైరెక్టర్ సురేందర్ రెడ్డి అదే కథను అల్లు అర్జున్ కి వినిపించాడు. ఇక బన్నీకి కథ బాగా నచ్చడంతో వెంటనే పట్టాలెక్కించారు. ఆ తర్వాత సినిమా విడుదల కావడం, బన్నీ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగిపోయాయి. 

బన్నీకి బ్లాక్ బస్టర్ 

యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, శ్యామ్, శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో అల్లు అర్జు బాడీ లాంగ్వేజ్, మాస్ యాక్షన్, డైలాగ్స్, కామెడీ, బ్రదర్ సెంటిమెంట్  ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ దేవుడా.. డైలాగ్ అప్పట్లో ఫుల్ ట్రెండ్ అయ్యింది. ఇందులో మద్దాలి శివారెడ్డి పాత్ర కూడా బాగా పాపులర్ అయ్యింది.అలాగే  శృతి హాసన్, ప్రకాష్ రాజ్ పాత్రలు  కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 'రేసుగుర్రం'  హిట్ తర్వాత శృతి కెరీర్ కూడా  రేసుగుర్రంలా దూసుకుపోయింది. తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.  ఈ సినిమాతో అల్లు అర్జున్ మొదటి సారి రూ. 50 కోట్ల క్లబ్ లో చేరిపోయి.. స్టార్ హీరోల రేసులో దూసుకుపోయాడు. ఒకవేళ ఈ సినిమా అల్లు అర్జున్ చేసి ఉంటే ఎలా ఉండేదో తెలియదు? కానీ అల్లు అర్జున్ మాత్రం  'లక్కీ' పాత్రకు పర్ఫెక్ట్ అనేలా యాక్ట్ చేశారు.  అప్పటివరకు రొమాంటిక్, సీరియస్ కథలతో అలరించిన అల్లు అర్జున్.. రేసుగుర్రంతో తనలోని మాస్ యాంగిల్ పరిచయం చేశారు. ఇందులో బన్నీ నటనకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది. ఆ సినిమా ఏంటో తెలుసా?

Also Read: TN Stampede: విజయ్ ర్యాలీ తొక్కిసలాట ఘటనపై స్పందించిన మెగాస్టార్.. ట్వీట్ వైరల్!

#Allu Arjun #cinema
Advertisment
తాజా కథనాలు