Pakistan : పాకిస్తాన్ క్రికెట్ గ్రౌండ్‌లో బాంబ్ బ్లాస్ట్..  పరుగులు పెట్టిన ప్లేయర్లు.. ఒకరు మృతి!

పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఒక స్టేడియంలో బాంబు పేలుడు సంభవించింది. బజౌర్ జిల్లాలోని ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.  

New Update
bomb blast

పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఒక స్టేడియంలో బాంబు పేలుడు సంభవించింది. బజౌర్ జిల్లాలోని ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.  ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా పిల్లలతో సహా అనేక మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

ఈ ఊహించని పరిణామంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు భయంతో పరుగులు పెట్టారు. దీంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.పేలుడు ఘటన  తరువాత చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడి ఒక ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్ (IED) ద్వారా జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు. 

దేశంలో భద్రతపై ఆందోళనలు 

కాగా గతంలో కూడా పాకిస్తాన్ లో క్రికెట్ స్టేడియాల సమీపంలో పేలుళ్లు జరిగాయి. ఈ సంఘటనలు దేశంలో భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. పాకిస్తాన్ లో తరచుగా ఇటువంటి దాడులు జరుగుతుండటం వల్ల అంతర్జాతీయ క్రికెట్ జట్లు పర్యటించడానికి వెనకాడుతున్నాయి.ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఒక పోలీస్ స్టేషన్‌పై గత వారం క్వాడ్‌కాప్టర్ ద్వారా దాడి జరిగింది.  పోలీసు కానిస్టేబుల్ తో సహా ఒక పౌరుడు గాయపడ్డారు.

Advertisment
తాజా కథనాలు