Inter Results : తెలంగాణ(Telangana) లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను(Intermediate Exam Results) ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండో ఏడాది పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. అలాగే 10వ తరగతి పరీక్ష ఫలితాలను కూడా ఈ నెల 30 లేదా మే 1న విడుదల చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఈయర్, సెకండియర్ కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు పాశారు. మార్చి 10 నుంచి మూల్యంకనం చేపట్టగా.. ఏప్రిల్ 10 నాటికి ముగిసింది. మరోవైపు మార్కుల నమోదుతో పాటు సాంకేతికపరంగా ఇలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read: కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. బాంబ్ పేల్చిన మంత్రి ఉత్తమ్
ఇక పదో తరగతి పరీక్షలు(10th Class Exams) మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి. మొత్తం 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం శనివారం నాటికి పూర్తయింది. వారం రోజుల పాటు ఫలితాలను డీకోడింగ్ చేసిన తర్వాత మార్చి 30 లేదా ఏప్రిల్ 1న ఉదయం ఫలితాలు విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్(Election Code) ఉన్నవేళ మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు.
Also Read: 20 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి..