First Budget In Independence India : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామరన్(Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024(Central Budget 2024) ను ప్రవేశపెట్టనున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్(Interim Budget). 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ(Modi) ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్. ఇక బడ్జెట్ చరిత్ర చూస్తే నవంబర్ 26, 1947న స్వతంద్ర దేశపు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను అప్పటి ఆర్థిక మంత్రి R. K. షణ్ముఖం చెట్టి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను సమర్పించడాన్ని శెట్టి తన అదృష్టంగా భావించారు. ఇది ఇప్పటి బడ్జెట్‌కు చాలా భిన్నంగా ఉంది. బ్రిటీష్ పాలన నుంచి భారత్ విముక్తి పొందిన తర్వాత.. బడ్జెట్ ద్వారా ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేయాల్సి వచ్చింది. అప్పటి బడ్జెట్‌లో మొత్తం వార్షిక వ్యయంపై ప్రభుత్వం ఏ అంచనా వేసింది? ఆర్థిక మంత్రి ఏం చెప్పారు? లాంటి విషయాలను తెలుసుకోండి.
శెట్టి ధరించిన డ్రెస్ ఏంటి?
శెట్టి ఆ రోజు టై, వైట్ షర్ట్‌తో బ్లాక్ సూట్ ధరించాడు. ఆయన చేతిలో బ్రీఫ్‌కేస్ ఉంది. బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత ఆల్ ఇండియా రేడియో(All India Radio) లో ప్రసారం చేశారు. స్వాతంత్య్రం(Independence) వచ్చేనాటికి భారత ఆర్థిక వ్యవస్థ రూ.2.7 లక్షల కోట్లు మాత్రమే. ఇది ప్రపంచ జీడీపీలో 3 శాతం కంటే తక్కువ. బ్రిటీష్ వారు దేశాన్ని ఎలా దోచుకున్నారో తెలిసిందే.
దేశ తొలి బడ్జెట్‌లో మొత్తం ఆదాయం రూ.171.15 కోట్లుగా అంచనా వేశారు. రూ. 197.29 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అప్పుడు ఆర్థిక లోటు అంచనా రూ.26.24 కోట్లు. బడ్జెట్ డిఫెన్స్ సర్వీసుల కోసం దాదాపు రూ.92.74 కోట్లు కేటాయించారు.
Also Read: రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి.
WATCH: