Ponnam Prabhakar: బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ (KCR) పదేళ్ల పరిపాలనపై కాంగ్రెస్ మంత్రి పొన్న ప్రభాకర్ (Ponnam Prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించి, ఆంధ్రపాలకులతో కుమ్ముక్కు అయిన వారినే ప్రగతి భవన్ లో కేసీఆర్ రెడ్ కార్పేట్ వేసి ఆహ్వానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన తెలంగాణ బిడ్డలం తామేనని, పార్లమెంట్ లో తెలంగాణ సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడినట్లు గుర్తు చేశారు.
కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు..
ఈ మేరకు విభజన హామీలకు సంబంధించి 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించి, ప్రాణాలకు తెగించి పోరాడిన వారినే ఎన్నడూ కలవడానికి కేసీఆర్ అవకాశం ఇవ్వలేదన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ మనుగడ కోసం రాయలసీమ వెళ్ళిపోయి రాయలసీమా రతనాల సీమా కావాల్సిందే అని ప్రసంగిస్తే తెలంగాణ కోసం కొట్లాడింది దేనికోసమని మండిపడ్డారు.
మా గుండె బాధపడదా?
'మనం తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడితే.. ఆయన రాయలసీమకు వెళ్లి, అక్కడ భోజనం చేసి.. రాయలసీమను ప్రశంసిస్తే మా గుండె బాధపడదా? మేము ఎన్నడూ కూడా ప్రగతి భవన్ వెళ్లిన పరిస్థితి లేదు. మాకు అవకాశం ఇవ్వలేదు. తెలంగాణ వ్యతిరేకించిన వారికి ప్రగతి భవన్ లో రెడ్ కార్పేట్ వేశారు. తెలంగాణ కోసం మా నాయకుడు వైఎస్సార్ కొడుకైనా జగన్మోహన్ రెడ్డి తో మేము విభేదించాం. మీరు ఇంటికి పిలిచి ఫ్లవర్ బొకేలు ఇచ్చి స్వాగతం పలికి తెలంగాణకు అన్యాయం చేశారు' అంటూ ఆరోపించారు.
ఇది కూడా చదవండి : Ayodhya Ram Mandir: అయోధ్యలో రెచ్చిపోతున్న దొంగలు.. 60 మంగల సూత్రాలు చోరీ..
2 నెలలు గడవకముందే ఆరోపణలు..
ఇక ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఎన్నడూ కేసీఆర్ మాట్లాడలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడవకముందే ఆరోపణలు చేస్తున్నారంటూ వాపోయారు. కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి ఉపయోగించుకునే హక్కు ఉంది. జలశాయలు ఎప్పుడు సదశయాలే. మీ హయాంలో పాలిచ్చే ఆవులుగా మారి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునే ఎటిఎంలుగా మారాయని స్వయంగా ప్రధాని మోడీ అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం atm లుగా మారింది. ముఖ్యమంత్రి చెప్పినట్టు ఈ సభ ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నాం. ఇది తెలంగాణ ఆత్మగౌరవ ముచ్చట. తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే అందరం ఢిల్లీ వెళ్లి కొట్లాడదాం. రైతుల హక్కుల కోసం తెలంగాణ గద్దెల మీద కూర్చుందాం. రాజకీయంగా తరువాత ఎన్నికల్లో కొట్లాడదామని ప్రభాకర్ సూచించారు.