KarimNagar: కస్తూర్భా కాలేజీలో విషాదం..ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య!

కరీంనగర్‌ లోని కస్తూర్బా కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. అక్షిత అనే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులను క్షమించమని కోరుతూ సూసైడ్‌ నోట్‌ రాసింది.

New Update
KarimNagar: కస్తూర్భా కాలేజీలో విషాదం..ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య!

KarimNagar: కరీంనగర్‌ లోని కస్తూర్బా కాలేజీలో(Kasthurba College) విషాదం చోటు చేసుకుంది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థిని (Inter First Year)  ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide)  చేసుకుంది. తనకంటే మార్కులు తక్కువ వచ్చిన వారికి ఇంపార్టెన్స్‌ ఇచ్చి నన్ను ఏమి రాని మొద్దు కింద జమ కట్టారని తల్లిదండ్రులకు లేఖ (Letter) రాసి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కరీంనగర్‌ లోని కొత్తపల్లి మండలం శాంతినగర్‌ కస్తూర్బా కాలేజీలో జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడంపల్లి గ్రామానికి చెందిన అక్షిత అనే విద్యార్థిని ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతుంది. కొద్ది రోజుల క్రితం కాలేజీలో నిర్వహించిన పరీక్షల్లో మార్కులు తక్కువ రావడంతో అధ్యాపకులు ఆమెను కామర్స్‌ కు మార్చారు.

publive-image

దీంతో అక్షిత కొద్ది రోజుల నుంచి దిగులుగా ఉంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి తల్లిదండ్రులను క్షమించమని కోరుతూ సూసైడ్‌ నోట్‌ రాసింది. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వారిని ఉంచి నన్ను మాత్రం తరగతి మార్చడం వల్ల నేను చాలా బాధపడుతున్నాను. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను..అంటూ లేఖ రాసి ఉరేసుకుంది.

విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడాన్ని గమనించిన కాలేజీ సిబ్బంది వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా..అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రి మార్చురీలో అక్షిత మృతదేహన్ని ఉంచారు. విద్యార్థిని మృతి గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు ఆసుపత్రి వద్దకు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాలేజీలో వివక్ష వల్లే తమ కూతురు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాలేజీ సిబ్బంది పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Also read: సీక్రెట్‌ గా పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్‌..మెడలో మంగళసూత్రమే సాక్ష్యం!

Advertisment
తాజా కథనాలు