/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-11T094507.667-jpg.webp)
Gurukula School & College Students Suicide : తెలంగాణ(Telangana) లో వరుస విద్యార్థుల మరణాలు కలవరపెడుతున్నాయి. ఇటీవలే కామారెడ్డి జిల్లా(Kamareddy District) లో పదో తరగతి(10th Class Students) విద్యార్థుల ఆత్మహత్య(Suicide) ఇష్యూ సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఇంటర్మీడియట్(Intermediate) విద్యార్థిని అనుమానస్పదంగా మరణించిన ఘటన సూర్యపేట జిల్లాలో జరిగింది.
ఇమాంపేట గురుకుల పాఠశాల..
ఈ మేరకు హాస్టల్ వార్డెన్, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట(Suryapet) పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన బాలిక ఇమాంపేట గురుకుల పాఠశాలలో(Gurukula School) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే పాఠశాలలో శనివారం సాయంత్రం ఫ్రెషర్స్ డే నిర్వహించారు యాజమాన్యం. ఈ వేడకలో పాల్గొన్న అమ్మాయి అందిరితో చలాకిగానే ఎంజాయ్ చేసింది. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. రాత్రి 10 గంటల సమయంలో అస్వస్థతకు గురైంది. దీంతో హాస్టల్ వార్డెన్ విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘మీ కూతురు అనారోగ్యానికి గురైంది. వెంటనే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి రండి’ అని సమాచారం అందించాడు.
ఇది కూడా చదవండి : Karimnagar : కలుషిత మాంసం తిని ముగ్గురు మృతి.. 12మంది పరిస్థితి విషమం
హత్య చేశారంటూ ఆరోపణలు..
అయితే బాధితురాలి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరకున్న కొద్దిసేపటికే బాలిక మరణించింది. దీంతో కన్నీటి పర్యంతమయ్యారు పేరెంట్స్, బంధువులు. ‘మా బిడ్డ ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఉన్నప్పుడు మాకు వీడియో కాల్ చేసి మాట్లాడింది. కాసేపటికే వార్డెన్ నుంచి ఫోన్ వచ్చింది. హాస్టల్‌లో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మాకు అనుమానంగా ఉంది' అంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఇష్యూపై సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం స్పందిస్తూ.. ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించామని, పూర్తి విచారణ చేపట్టి విద్యార్థిని మృతికి గల కారణాలు వెల్లడిస్తామన్నారు.