TS Inter: నేటి నుంచి ఇంటర్‌ ప్రవేశాలు ప్రారంభం..

తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను మే 9 నుంచి ప్రారంభిస్తున్నామని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. జూన్ 1 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

New Update
TS Inter: నేటి నుంచి ఇంటర్‌ ప్రవేశాలు ప్రారంభం..
TS Inter Admissions 2024-25: తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను మే 9 నుంచి ప్రారంభిస్తున్నామని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. జూన్ 1 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, మైనారిటీ, సహాకార, గురుకుల, కేజీబీవీ, ఆర్‌జేసీ, ఒకేషనల్, మోడల్, కాంపోజిట్ తదితర జూనియర్ కళాశాలల్లో ఈ షెడ్యూల్ పాటించాలని స్పష్టం చేశారు. అయితే ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎటువంటి పరీక్షలు నిర్వహించరాదని.. అలా చేస్తే కళాశాల యాజమాన్యంపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారా.. బస్సు యాత్ర ఏం చెబుతోంది!

అలాగే ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ప్రవేశాల కోసం ప్రకటనలు ఇస్తే.. వాటిపై పబ్లిక్ పరీక్షల ( మాల్‌ప్రాక్టీస్, ఇతర అనైతిక చర్యల నిరోధక) రూల్స్ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. బాలికల భద్రతకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ప్రవేశాల సమయంలో ప్రతి కాలేజీ ఎంట్రన్స్ గేట్ వద్ద.. మంజురైన సెక్షన్లు, భర్తీ చేసే సీట్ల వివరాలను రోజువారీగా ప్రదర్శించాలని అంతేగాని ప్రకటనలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.

Also Read: రేవంత్‌లో అసహనం పెరిగిపోతుంది.. కిషన్‌రెడ్డి సెటైర్లు

Advertisment
తాజా కథనాలు