USA: పెన్సిల్వేనియాలో ఆశ్చర్య గొలిపే ఘోస్ట్ సిటీ..

ఆ ఊర్లో అక్కడక్కడా ఇళ్లు ఉంటాయి. కానీ వాటిలో ఎవరూ ఉండరు. ఎటుచూసినా చెట్ల తుప్పలే కనిపిస్తాయి. అందమైన రోడ్లు ఉన్నా... వాటిని ఆక్రమిస్తూ మొక్కలుంటాయి.అంతా నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది.అందుకే ఆ టౌన్‌ని ఘోస్ట్ టౌన్‌గా పిలుస్తారు. అది ఎక్కడ ఉందో తెలుసా..అయితే ఇది చదివేయండి.

USA: పెన్సిల్వేనియాలో ఆశ్చర్య గొలిపే ఘోస్ట్ సిటీ..
New Update

Pennsylvania :పెన్సిల్వేనియా రాష్ట్రానికి తూర్పు తీరంలో ఉంది సెంట్రాలియా. ఇక్కడ భూగర్భంలో మండుతున్న జ్వాల ఉండటం ఓ ప్రత్యేకత. అయితే.. దీనికి మరో చరిత్ర కూడా ఉంది. నిజానికి ఇదో మైనింగ్ టౌన్. 1962కి ముందు చాలా బిజీ ప్రాంతం. కార్మికులు కంటిన్యూగా గనుల తవ్వకాలు జరిపేవారు. గనుల్లోని ముడి పదార్థాలను తీసుకెళ్లే వాహనాల రాకపోకలతో చాలా బిజీగా ఉండేది. ఇక కార్మికులు నివసించేందుకు ఈ పట్టణంలోనే ఇళ్లు ఉండేవి. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ అందరూ కష్టపడి.. సెంట్రాలియా భూగర్భాన్ని తవ్వుతూ ఉండేవారు.అదిగో సరిగ్గా అప్పుడే వచ్చింది అనుకోకుండా వచ్చింది ఒక రోజు ఆ వూరికి ప్రళయం.

అదే తలగబడుతున్న గని. ఇల్లు తగలబడితే.. మంటల్ని ఒక రోజులో ఆర్పేయవచ్చు. అడవి తగలబడితే.. ఓ వారంలో కార్చిచ్చు కంట్రోల్ అవుతుంది. కానీ... సెంట్రాలియాలో తగలబడుతున్నది ఇల్లు, అడవి కాదు... గని. పెద్ద గని. పైగా దానికి భూగర్భంతో లింక్ ఏర్పడింది. అందువల్ల అది దాదాపు అగ్నిపర్వతంలా మారింది. భూమి లోపలి నుంచి లావా లాంటి అగ్ని మండుతూ పైకి వస్తోంది. మనం అక్కడికి వెళ్లి చూస్తే.. మనకు మంట కనిపించదు. భూమి లోంచీ పొగ వస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుంది. మంట ఉన్న ప్రదేశాన్ని మూసేద్దామని ప్రయత్నించినా వీలు కాదు. ఎందుకంటే... మంటతోపాటూ వస్తున్న గ్యాస్.. పైకి తన్నుతోంది. దీంతో.. భూకంపం వచ్చినట్లు ఆ ప్రాంతంలో పగుళ్లు ఏర్పడ్డాయి. దాంతో అప్పటి నుంచి అక్కడ నివసించడం ప్రమాదకరంగా మారింది.

Also Read:Telangana: కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం-మంత్రి ఉత్తమ్



#usa #pennsylvania #ghost-city
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe