Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. అక్కడ పనిచేస్తే రూ.8 లక్షల ప్యాకేజ్‌

ప్రముఖ ఐటీ దిగ్గజం.. ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు అదిరిపోయే ప్యాకేజ్‌ను ప్రకటించింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఏర్పాటుచేసిన డెవలప్‌మెంట్ సెంటర్‌లో పనిచేసేందుకు ముందుకొస్తే రూ.8 లక్షల వరకు ప్రోత్సహకాలు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చింది.

Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. అక్కడ పనిచేస్తే రూ.8 లక్షల ప్యాకేజ్‌
New Update

Infosys Announcement : ప్రముఖ ఐటీ దిగ్గజం.. ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగులకు అదిరిపోయే ప్యాకేజ్‌ను ప్రకటించింది. కర్ణాటక (Karnataka) లోని హుబ్బళ్లిలో ఏర్పాటుచేసిన డెవలప్‌మెంట్ సెంటర్‌లో పనిచేసేందుకు ముందుకొస్తే రూ.8 లక్షల వరకు శాలరీ ఇస్తామని పేర్కొంది. ఇందుకోసం ఉద్యోగులకు ఇటీవలే ఈమెయిల్‌ ద్వారా సమాచారం పంపించింది. ప్రాజెక్టు డెవలప్‌మెంట్ విధుల్లో ఉన్న బ్యాండ్-2, ఆపై స్థాయిలో ఉన్న ఉద్యోగులకు బదిలీ ప్రోత్సహకాలు అందిస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. ఇండియా (India) లో ఏ డెవలప్‌మెంట్ సెంటర్‌నుంచైనా ఉద్యోగులు ఇక్కడికి రావొచ్చని తెలిపింది. ఇక బ్యాండ్ 3, అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు బదిలీ సమయంలో రూ.25 వేలు ఇస్తామని చెప్పింది.

Also Read: పుస్తకాలు అగ్నికి కాలిపోవచ్చు.. కానీ జ్ఞానం కాదు : మోదీ

అనంతరం ప్రతీ ఆరునెలలకు రూ.25 వేల చొప్పున రెండేళ్ల పాటు ఇస్తామని తెలిపింది. మొత్తంగా వీళ్లు రూ.1.25 లక్షల ప్రోత్సహకాలు అందుకోనున్నారు.

బ్యాండ్ 4 ఉద్యోగులకు రూ.2.5 లక్షలు, బ్యాండ్ 5 రూ.5 లక్షలు, బ్యాండ్‌ 6 స్థాయి ఉద్యోగులకు రూ.8 లక్షల ప్రోత్సహకాలు అందిస్తామని తెలిపింది. అయితే కర్ణాటకలో హుబ్బళ్లి (Hubballi) టైర్‌-2 సిటీగా ఉంది. వాస్తవానికి ఇక్కడ పనిచేసేందుకు ఎవరు ఆసక్తి చూపకపోవడంతో కంపెనీ ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా ముంబయి-కర్ణాటక ప్రాంతాలకు చెందిన ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్నిరోజుల క్రితం హుబ్బళ్లి ఇన్ఫోసిస్ క్యాంపస్‌కు సంబంధించి చర్చ జరిగింది. వేలాదిమంది ఉద్యోగులు ఇస్తామని ప్రారంభించిన ఈ సెంటర్‌లో మొక్కలు మాత్రమే పెరుగుతున్నాయని ఓ ఎమ్మెల్యే సెటైర్‌ వేశారు. ఇంకా అక్కడ ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభం కాలేదని అన్నారు. ఉద్యోగాలు ఇస్తారనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం 58 ఎకరాలు కేటాయించిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇన్ఫోసిస్ అక్కడ కార్యక్రమాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

Also Read: షారూక్ ను మించిపోయిన కోహ్లీ.. అదీ బ్రాండ్ అంటే!

#telugu-news #hubballi #infosys #karnataka
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe