General Elections 2024: ఈ మహిళా అభ్యర్థులు మెషీన్‌ గన్‌లు.. లోక్‌సభ ఎన్నికల్లో పేలుతారా?

లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి బరిలోకి దిగనున్న అత్యంత ప్రభావవంతమైన మహిళా అభ్యర్థులు ఎవరు? ఫైర్ బ్రాండ్ల నుంచి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ల వరకు ఈ సారి చక్రం తిప్పగల మహిళా అభ్యర్థుల లిస్ట్‌ కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

General Elections 2024: ఈ మహిళా అభ్యర్థులు మెషీన్‌ గన్‌లు.. లోక్‌సభ ఎన్నికల్లో పేలుతారా?
New Update

ఎన్నికలు ఎప్పుడు జరిగినా మహిళా అభ్యర్థులపై ఓటర్ల ఫోకస్‌ ఎక్కవగా ఉంటుంది. అందులోనూ బాగా తెలిసిన మహిళలైతే వారు పోటి చేసే స్థానంవైపు దృష్టి మరలడం పక్కా. ఆ అభ్యర్థులు వేసే ప్రతీ అడుగును ఓటర్లు గమనిస్తుంటారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్లగా పేరు తెచ్చుకున్న వాళ్లు సినీ తారలైతే మీడియా ఫోకస్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. అదనంగా వారి గ్లామర్‌ ఎలాగో ఆకర్షిస్తుటుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీ దూకుడు కనబరుస్తోంది. అటు కాంగ్రెస్‌ స్లో అండ్‌ స్టడీ విన్స్‌ ద రేస్‌ అనే సూత్రానికి కట్టుబడి ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇక దేశంలోని మిగిలిన ప్రాంతీయ పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించుకునే పనిలో ఉన్నాయి. ఇక ఈసారి ఏడుగురు మహిళా అభ్యర్థులపై ఎక్కువగా దృష్టి నెలకొంది. వీరంతా ప్రభావవంతమైన మహిళా అభ్యర్థులు. వారు ఎవరో ఓ లుక్కేయండి.

publive-image
స్మృతి ఇరానీ మరోసారి అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో యూపీలోని అమేథీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై గెలిచారు ఇరానీ. నాటి ఎన్నికల సమరంలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు.

publive-imageమహువా మోయిత్రా పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ (లోక్‌సభ నియోజకవర్గం) నుంచి గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. మహువా మొయిత్రా టీఎంసీ ఫైర్ బ్రాండ్‌గా పేరుంది. ఎన్ఐసి పోర్టల్ లాగిన్, పాస్‌వర్డ్‌ను పంచుకున్నందుకు లోక్సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సును అనుసరించి డిసెంబరు 8,2023న మొయిత్రాను అనర్హురాలిగా లోక్సభ నుంచి బహిష్కరించారు. రానున్న ఎన్నికల్లో మరోసారి కృష్ణానగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

publive-image

నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. కంగనా పోటి చేయడం ఇదే తొలిసారి. ఆమె నిత్యం బీజేపీకి సపోర్ట్‌గా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతుంటారు.

publive-image

ఒకప్పుడు బాలీవుడ్ 'డ్రీమ్ గర్ల్'గా పేరు తెచ్చుకున్న హేమమాలిని ఈ ఎన్నికల్లో పోటికి సిద్ధమయ్యారు. మథుర నుంచి బీజేపీ ఎంపీగా ఈ ముద్దుగుమ్మ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

publive-image

ప్రియాంక గాంధీ కుటుంబ కంచుకోట రాయ్ బరేలీ నుంచి ఎన్నికల్లో పోటి చేయనున్నారు.

publive-image

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ తన సరళమైన, శక్తివంతమైన ప్రసంగాలతో జనాన్ని ఆకర్షించే స్వభావం ఉన్న తెలివైన రాజకీయవేత్తగా నిరూపించుకున్నారు. మెయిన్పురి సీటు నుంచి ఆమె పోటికి దిగుతున్నారు.

publive-image

బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ స్థానం నుంచి లోక్ సభకు పోటీ చేయనున్నారు. బన్సూరి స్వరాజ్ దివంగత మహానేత సుష్మాస్వరాజ్ కుమార్తె.

Also Read: కవితకు బెయిల్ ?? కోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ!

#smriti-irani #kangana-ranaut #general-elections-2024 #mahua-moitra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe