Court Judgment : భార్యే భర్తకు భరణం ఇవ్వాలి.. కోర్టు సంచలన తీర్పు..!!

భార్య భర్తల మధ్య గొడవల వల్ల విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. భార్యకు భర్త భరణం చెల్లించాలని కోర్టులు తీర్పులు ఇస్తుంటాయి. కానీ ఓ దంపతుల విడాకుల కేసులో ఇండోర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యే భర్తకు భరణం కింద నెలకు రూ. 5వేలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

New Update
Court Judgment : భార్యే భర్తకు భరణం ఇవ్వాలి.. కోర్టు సంచలన తీర్పు..!!

Wife - Husband Fight : భార్య భర్త(Wife - Husband) ల మనస్పర్థలు సాధారణమే. కానీ నేటి కాలంలో చిన్న విషయానికే విడాకులు తీసుకుంటున్నారు. టూత్ పేస్టు తనకు నచ్చలేదని విడాకులు తీసుకున్న జంటలను కూడా చూశాం. భార్య, భర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భార్యకు భర్త భరణం చెల్లించాలంటూ కోర్టులు తీర్పు చెబుతుంటాయి. కానీ ఓ దంపతుల విషయంలో ఇండోర్ కోర్టు(Indore Court) సంచలన తీర్పును వెలువరించి షాకిచ్చింది.

భార్యే భర్తకు భరణం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. భర్త తెలివి తేటలతోనే ఇది సాధ్యమైంది. భర్త తెలివి భార్య తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి నెలకొంది. భార్యే భరణం కింద నెలకు రూ. 5000 చెల్లించాలంటూ చెప్పిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు విషయం ఏంటంటే మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని ఇండోర్ లో నివసిస్తున్న అమన్, నందినిలది ప్రేమ వివాహం. వీరిద్దరు ఇండోర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. నందిని బ్యూటీపార్లర్ నిర్వహిస్తుంది. భార్య భర్తల మధ్య మనస్పర్థల కారణంగా తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. వరకట్న వేధింపుల కింద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అమన్ పై వరకట్న వేధింపుల ఆరోపణలపై ఫ్యామిలీ కోర్టు కేసు విచారణ చేపట్టింది.

అయితే తన భార్యను గ్రాడ్యుయేషన్ చేయించానని తాను మాత్రం 12 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని అమన్ కోర్టుకు తెలిపారు. నందిని బ్యూటీ పార్లర్(Beauty Parlor) ద్వారా సంపాదిస్తుందని.. తనకు ఎలాంటి ఆదాయం లేదని కోర్టుకు తెలిపాడు. తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నట్లు అమన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అమన్ వాదనలో ఏకీభవించిన ఫ్యామిలీ కోర్టు(Family Court) అతని భార్య నందిని నెలకు రూ. 5,000 భరణం కింద చెల్లించాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి : రకుల్-భగ్నానీ జంటకు..పీఎం మోదీ స్పెషల్ గ్రీటింగ్స్..!!

Advertisment
తాజా కథనాలు