Flight: పైలట్ల నిర్వాకం..దారి తప్పిన విమానం..ఏమైందంటే.!

పైలెట్లు ఇద్దరు నిద్రపోవడంతో విమానం అరగంటపాటు దారితప్పి ప్రయాణించింది. పైలట్ కు మెలకువ రావడంతో అధికారులతో సంప్రదించి దారితప్పిన విమానాన్ని తిరిగి గాడిలో పెట్టడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో 153మంది ప్రయాణికులు, 4సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది.

New Update
Flight: పైలట్ల నిర్వాకం..దారి తప్పిన విమానం..ఏమైందంటే.!

Flight: విమానం ఆకాశంలో ఉన్న సమయంలో ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకున్నారు. దాదాపు అరగంటపాటు విమానంలో ఆకాశంలో చక్కర్లు కొట్టింది. దారి తప్పి ఎక్కడెక్కడో ప్రయాణించింది. సడెన్ మెలుకున్న మెయిన్ పైలెట్ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో దారితప్పిన విమానంను తిరిగి గాడిలో పెట్టేందుకు అధికారులు ఎంతో శ్రమించాల్సింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది ఉణ్నారు. ఈ ఘటన ఇండోనేషియా రాజధాని జాకార్తలో జరిగింది. విధుల్లో నిద్రపోయిన ఇద్దరు పైలట్లను అధికారులు సస్పెండ్ చేశారు.

అసలు విషయం ఏంటంటే...బాతిక్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం 153 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సౌత్ ఈస్ట్ సులవేసి నుంచి జకార్తాకు బయలుదేరింది. విమానంలో గాల్లోకి వెళ్లిన కొద్ది నిమిషాలకు కో పైలట్ కు చెప్పి మెయిన్ పైలట్ నిద్రపోయాడు. అయితే మరికొన్ని నిమిషాల్లోనే విమానం నడుపుతున్న కో పైలెట్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. దీంతో విమానం దారితప్పింది. అరగంట తర్వాత ప్రధాన పైలట్ కు మెలకువ వచ్చింది.

publive-image

పక్కన చూస్తే కో పైలట్ గురక పెట్టి నిద్రిస్తున్నాడు. దీంతో విమానం దారి తప్పిందన్న సంగతి గుర్తించిన పైలట్...కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాడు. వారు అప్పటికే ఎన్నో సార్లు ప్రయత్నించినట్లు చెప్పారు. చివరికి వారికి దిశానిర్దేశం చేయడంతో విమానాన్ని సురక్షితంగా ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేవారు. అయితే పైలట్ల వ్యవహారంపై అధికారులు ఫైర్ అయ్యారు. విచారణకు ఆదేశించి వారిద్దరిని సస్పెండ్ చేశారు.

publive-image

ఇది కూడా చదవండి: ఈ ఒక పనిచేస్తే చాలు..రైతులకు ప్రతినెలా 1045 యూనిట్ల ఫ్రీ విద్యుత్..!

Advertisment
తాజా కథనాలు