Telangana : ఇందిరమ్మ ఇళ్లు గైడ్‌లైన్స్‌ ఇవే..

నిన్న ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముణుగూరులో ప్రారంభించారు. దాని తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ గైడ్ లైన్స్‌ను రిలీజ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు. మహిళల పేరు మీదనే ఇళ్ళు ఇస్తామని తెలిపారు.

Telangana : ఇందిరమ్మ ఇళ్లు గైడ్‌లైన్స్‌ ఇవే..
New Update

Indiramma Indlu : తెలంగాణ(Telangana) లో ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని(Indiramma Indlu Scheme) భద్రాచలం(Bhadrachalam) జిల్లా ముణుగూరు వేదికగా ముఖ్యమంత్రి రేవంత్(CM Revanth Reddy) ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అర్హులైన మహిళల పేరుమీదనే ఇందిరమ్మ ఇళ్ళు అందిస్తామన్నారు. ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ ఉత్తర్వులను ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు జారీ చేశారు.

అద్భుతమైన మోడల్..
గైడ్ లైన్స్ ప్రకారం మహిళ పేరు మీద ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నారు. రేషన్‌ కార్డ్‌ ఆధారంగా బీపీఎల్‌కు దిగువన ఉన్నవారు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళకు అర్హులు అని చెబుతున్నారు. మొదటి దశలో సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. లబ్ధిదారుడు గ్రామం, లేదా అర్బన్‌ లోకల్‌ బాడీకి చెందినవారై ఉండాలి. దాంతో పాటూ ఈ పథకానికి అద్దెకుంటున్న వారు కూడా అర్హులే అని తెలిపారు. ఇక ఇందిరమ్మ ఇళ్ళల్లో 400 గజాల్లో అధ్బుతమైన మోడల్ లో ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. సొంత స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. రెండు బెడ్ రూమ్స్, హాల్, కిచెన్, వాష్ రూమ్, కౌంపౌండ్ వాల్ నిర్మించగా దీనికి జాతీయ జెండాలో మూడు రంగులు వేయనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లపై (Indiramma Indlu Scheme) అభయహస్తం ముద్ర కూడా ఉంటుందని స్పష్టం చేశారు. విశాలంగా ఇళ్ళు నిర్మించుకునేలా ప్లాన్ చేశామని గైడ్‌్లైన్స్‌లో తెలిపారు.

నాలుగు దశల్లో డబ్బులు జమ..
ఇందిరమ్మ ఇళ్ళు 4 దశల్లో పూర్తి చేసుకునేలా రుణం అందజేస్తామన్నారు. నాలుగు దశల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందివ్వనున్నారు. బేస్‌మెంట్‌ లెవల్‌కు రూ.లక్ష.. స్లాబ్‌ లెవల్‌కు మరో రూ.లక్ష..స్లాబ్‌ పూర్తయిన తర్వాత రూ.2లక్షలు.. ఇల్లు పూర్తయిన తర్వాత మరో లక్ష...ఇలా ఇన్స్టాల్‌మెంట్‌లో ఇవ్వనున్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున 4లక్షల 50వేల ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకొని లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ అయిన మంత్రి అధ్యక్షతన లబ్ధిదారులను కలెక్టర్ ఫైనల్‌ చేస్తారు. గ్రామ పంచాయతీల జనాభాకు అనుగుణంగా ఎంపిక జరుగుతుంది.

మహిళల పేరుమీదనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం... పేదల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇళ్లు ప్రతీక అంటూ రేవంత్ రెడ్డి నిన్నటి సభలో చెప్పారు.

Also Read:Telangana : నేడు రాష్ట్రానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

#telangana #revanth-reddy #indiramma-indlu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe