Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దసరా పండగ నాటికి ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వివరించింది. అర్హులను ఎలా గుర్తించాలి అనే దాని మీద ఇప్పటికే అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. లబ్ధిదారుల ఎంపిక కోసం మార్గదర్శకాల పై అధికారులు అధ్యయనం మొదలు పెట్టారు.
ఏపీ, మధ్యప్రదేశ్ లో అమలవుతున్న విధానంపై స్టడీ మొదలుపెట్టిన అధికారులు. మూడు నెలల టైమ్‌లో లబ్ధిదారుల ఎంపిక సాధ్యమా? అనే యోచనలో ఉన్న ప్రభుత్వం. ఏటా నాలుగన్నర లక్షల ఇళ్లు మంజూరు చేసే విధంగా కార్యచరణ రూపొందించిన అధికారులు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 82 లక్షల 82 వేలు దరఖాస్తులు వచ్చాయి.
ఇళ్ల నిర్మాణ ప్రగతి ఆధారంగా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాధికారులు ఆలోచిస్తున్నారు. ముందస్తుగా లబ్ధిదారులు డబ్బును చెల్లించే విధంగా ముందస్తు కసరత్తులు చేస్తున్న అధికారులు. ప్రతి నియోజకవర్గానికి మూడున్నర వేల ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.7 వేల కోట్లను కేటాయించింది.