Indigo Starting Air Taxies In India : భారతదేశం(India) లో ట్రాఫిక్ సమస్య(Traffic Problem) గురించి చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రతీ నగరంలో, టౌన్‌లో కూడా ఇప్పుడు ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువ అయిపోయింది. మెట్రోలు, లోకల్ ట్రైన్‌లు ఎంత ఉన్నా కూడా ఈ సమస్య తీరడం లేదు. దాని కోసమే మరో ప్రత్యామ్నాయం ఆలోచించారు. అవే ఎయిర్ ట్యాక్సీలు(Air Taxies). రోడ్డు మీద తిరిగే వాటితో ట్రాఫిక్ సమస్యలు ఎప్పటికీ తీరవు. అందుకే ఇంక గాల్లో ట్యాక్సీ సేవలను మొదలుపెట్టాలనుకున్నారు. భారతదేశంలో అత్యంత ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఇండిగో(Indigo) దీనికి శ్రీకారం చుట్టింది. దీని మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్, అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా దేశంలో ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించనున్నాయి. 2026 నాటికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు సంస్థలు గతేడాదే దీని గురించి ఒప్పందం చేసుకున్నాయి.
ఈ ఎయిర్ ట్యాక్సీల్లో డ్రైవర్‌తో పాటూ నలుగురు కూర్చోవచ్చును. హెలికాఫ్టర్‌లానే ఉంటుంది. అయితే వాటంత హాడావుడి ఇవి చెయ్యవు. అదీకాక టేకాఫ్, ల్యాండింగ్‌లో కూడా వీటితో ఈజీగా అవుతుంది. హెలికాఫ్టర్లకు, విమానాలకు ఉండేటట్టు మరీ అంత ప్రత్యేకమైన పోర్టులు కూడా ఉండక్కర్లేదు అని చెబుతున్నారు. మామూలు ప్రయాణం కన్నా ఎయిర్ ట్యాక్సీలో చాలా తొందరగా చేరుకుంటాయి. 27 కిలోమీటర్లను కేవలం 7 నిమిషాల్లో చేరుకోవచ్చును. అయితే ఇందులో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే...ఈ ఎయిర్ ట్యాక్సీ ప్రయాణాలు ఖరీదుతో కూడుకున్నవి. 27 కిలోమీటర్లకు 2 నుంచి 3 వేలు ఖర్చు అవుతుంది. మామూలు ట్యాక్సీలు అయితే వెయ్యి లోపునే వస్తాయి.అదే తేడా రెండింటికీ.
ఇప్పుడు ఎయిర్ ట్యాక్సీలను కొనడానికి కూడా చాలానే ఖర్చు పెట్టవలసి ఉంటుంది. 200 ఎయిర్ ట్యాక్సీల ఖరీదు సుమారు 1 బిలియన్ డాలర్లు ఉంటుంది. అయినా కూడా వీటిని తీసుకురావాలనే అనుకుంటోంది ఇండిగో. ఇవి ఎంత వరకు సక్సెస్ అవుతాయో తెలియదు కానీ అడుగులు అయితే ముందకే వేయాలని భావిస్తోంది. ముందుగా ఈ సర్వీసులనుఢిల్లీ, ముంబయ్, బెంగళూరులో ప్రారంభిస్తామని ఇండిగో చెబుతోంది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చే ఏడాదికి సర్టిఫికేషన్ పొందే అవకాశం ఉందని, ఆపై డీజీసీఏ సర్టిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఆర్చర్ ఏవియేషన్ వస్థాపకుడు, సీఈఓ ఆడం గోల్డ్ స్టెయిన్ పేర్కొన్నారు. ఈ విమానంలో ఆరు బ్యాటరీలు ఉంటాయని, 30-40 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చని పేర్కొన్నారు. ఒక నిమిషం ఛార్జింగ్‌తో ఒక నిమిషం పాటు ప్రయాణించొచ్చని చెబుతున్నారు.
Also Read:Chandrababu- NTR: అలుపెరగని ధీరుడు..చంద్రబాబు బర్త్ డే స్పెషల్