National : స్విస్ బ్యాంకు నుంచి 60 కోట్లు డ్రా చేసిన ఇందిరాగాంధీ..స్విస్ పార్లమెంటులో ఆరోపణలు

ఎలక్టోరల్ బాండ్ల గురించి రచ్చ అవుతున్న తరుణంలో ఇందిరాగాంధీకి సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికల ఖర్చుల కోసం 60 కోట్లు విత్‌డ్రా చేసారనేది ఆ వార్త సారాంశం. ఆ సమయంలోనే దీని గురించి చాలా చర్చలు జరిగాయని కూడా తెలుస్తోంది.

New Update
National : స్విస్ బ్యాంకు నుంచి 60 కోట్లు డ్రా చేసిన ఇందిరాగాంధీ..స్విస్ పార్లమెంటులో ఆరోపణలు

Swiss Bank : ఎన్నిక(Elections) ల్లో పార్టీలు డబ్బులు నీళ్ళల్లా ఖర్చు పెట్టడం మనందరికీ తెలిసిందే. అయితే ఇది ఇప్పుడు మొదలైంది కాదు ఎప్పుడో ఇందిరాగాంధీ(Indira Gandhi) హయాంలోనే జరిగింది అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. భారతదేశం(India) లో రాజకీయాలు ఎప్పటి నుంచో కరప్షన్ అయ్యాయి అనడానికి ఇందిరాగాంధీ ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. 1979లో అమర్ ఉజాలో ప్రచురితమైన ఆర్టికల్‌ను ఎత్తి చూపిస్తున్నారు. ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల ఖర్చుల నిమిత్తం స్విస్ బ్యాంకు నుంచి 60 కోట్ల రూపాయలు విత్ డ్రా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన వార్తగా కూడా నిలిచింది. అనేక చర్చలకు కూడా దారి తీసిందని చెబుతున్నారు. ఈ దుమారం కేవలం మన దేశంలోనే ఆగిపోలేదు. స్విట్జర్లాండ్ ప్రభుత్వాన్ని(Switzerland Government) కూడా కుదిపేసింది. అక్కడ పార్లమెంటులో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది.

ప్రధాని ఇందిరాగాంధీ స్విస్ బ్యాంకు నుంచి డబ్బులు విత్ డ్రా చేయడాన్ని ఇంకో ప్రధాని చరణ్ సింగ్(PM Charan Singh) లేవనెత్తారు కూడా. భువనేశ్వర్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన దీని గురించి పబ్లిక్‌గానే ప్రస్తావించారు. అయితే ఈ డబ్బుల విత్ డ్రా అనే నేరం స్విట్జర్లాండ్‌లో జరగడం, ఇందిరాగాంధీ భారతదేశ పౌరురాలు కావడం లాంటి విషయాల వలన అక్కడ ప్రభుత్వం కానీ, మన దేశం కానీ ఏమీ చేయలేకపోయింది. దీని గురించి ఇండియన్ గవర్నమెంట్ స్విట్జర్లాండ్ ప్రబుత్వానికి లేఖ రాసినప్పటికీ ఏ యాక్షన్ తీసుకోబడలేదు అని తెలుస్తోంది. ఇందిరాగాంధీ స్విస్ బ్యాంకు అకౌంట్ వివరాలు కేవలం ఆ దేశ కోర్టు మాత్రమే ఇవ్వగలదని..కాబట్టి అక్కడి ప్రభుత్వం కోర్టును ఆడగాలని కూడా మన దేశం నుంచి వినతులు వెళ్ళాయి. అయితే అవేమీ కార్య రూపం దాల్చలేకపోయాయి.

ఇందిరాగాంధీ తన స్విస్ ఖాతాలో నుంచి 40 కోట్లు వెనక్కు తీసుకున్నారని మొదట వార్తలు వచ్చాయి. తరువాత అవి 60 కోట్లు అని తేలిందని అప్పటి ప్రధాని చరణ్ సింగ్ చెప్పారు. ఎన్నికల సమయంలో ఇందిరాగాంధీ, ఆమె కొడుకు సంజయ్ సింగ్ చాలా డబ్బులు ఖర్చు పెట్టారని చరణ్ సింగ్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి 10 వేలు పెట్టి జీపు కొనేందుకు వారికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని చరణ్ సింగ్ ప్రశ్నించారు. ఇదొక్కటే కాదు అప్పటి ఎన్నికల్లో ఒక్కొక్క కాంగ్రెస్ అభ్యర్థికి 5 వేలు చొప్పున ఇచ్చారని కూడా ఆయన ఆరోపించారు. విదేశా లనుంచి ముంబైకు పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని చెప్పారు. దీనికి సంబంధించిన వార్తలు, సమాచారం అన్నీ అప్పటి అమర్ ఉజాలా వార్తా పత్రికల్లో ప్రచురించబడ్డాయి.అవి ఇప్పటికీ లైబ్రరీల్లో వెతికితే దొరుకుతాయని అంటున్నారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య గొడవ అవుతున్న తరుణంలో ఇందిరాగాంధీ 60 కోట్ల విషయం ఇప్పుడు మళ్ళీ సెన్సేషనల్‌గా మారింది.

Also Read : Jyothirao Phule: భారతదేశ నిజమైన గురువు, మహాత్ముడు..జోతిరావ్ ఫూలే

Advertisment
Advertisment
తాజా కథనాలు