Israel: ఇజ్రాయిల్‌ లో ఉండే భారతీయులు జాగ్రత్త..ఎంబసీ ఆదేశాలు!

ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులకు భారతీయ రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని భారతీయ రాయబార కార్యాలయం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Israel: ఇజ్రాయిల్‌ లో ఉండే భారతీయులు జాగ్రత్త..ఎంబసీ ఆదేశాలు!
New Update

Israel: హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే, ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు ఇజ్రాయిల్ కారణమని ఇరాన్‌, హమాస్ ఆరోపిస్తున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ఇజ్రాయిల్ స్పందించలేదు. ఈ హత్యకు తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయిల్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

ఈ క్రమంలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులకు భారతీయ రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని ఇజ్రాయిల్‌లోని భారతీయ రాయబార కార్యాలయం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

స్థానిక అధికారులు సూచించిన భద్రతా ప్రోటోకాల్‌కి కట్టుబడాలని తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఎంబసీ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. భారత రాయబార కార్యాలయం ఇండియన్స్ కోసం రెండు సంప్రదింపు నంబర్‌లను +972-547520711 మరియు +972-543278392 మరియు ఒక ఇమెయిల్ ID — cons1.telaviv@mea.gov.in–ని కూడా షేర్ చేసింది. ఇప్పటికే పరిస్థితులు గంభీరంగా ఉండటంతో టెల్ అవీవ్‌కి వెళ్లే అన్ని విమానాలను ఎయిర్ ఇండియా ఆగస్టు 8 వరకు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Also read: ఈ ఏడాది సప్తముఖ మహశక్తి గణపతిగా ఖైరతాబాద్‌ గణేశుడు!

#indian-embasy #war #israel #hamas
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe