Cricket : మూడో మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా మీద భారత వుమెన్స్ జట్టు గెలుపు-సీరీస్ సమం చివరి టీ20 మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా మీద భారత మహిళల జట్టు వియం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సీరీస్ 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపొందగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. చివరి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. By Manogna alamuru 10 Jul 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి India VS South Africa : చివరి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా (South Africa) మొదట బ్యాటింగ్ చేసింది. 17.1 ఓవర్లలో కేవం 84 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దాంతో భారత్ (India) కు 85 పరుగులు లక్ష్యం వచ్చింది. . సౌతాఫ్రికా బ్యాటింగ్ లో తజ్మిన్ బ్రెట్స్ మాత్రమే ఎక్కువగా 20 పరుగులు చేసింది. ఆ తర్వాత.. అన్నేకే బోష్ (17), మారిజానే కాప్ (10), లారా వోల్వార్డ్ట్ (9) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లు తీయగా.. రాధ యాదవ్ 3 వికెట్లు పడగొట్టింది. అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో వికెట్ తీశారు. 85 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా (Team India) బ్యాటర్లు.. ఒక్క వికెట్ పడకుండా మ్యాచ్ గెలిచేశారు.స్మృతి మంధాన అర్ధ సెంచరీతో చెలరేగింది. 40 బంతుల్లో 54 పరుగులు చేసింది. ఇందులో సగం పరుగులు 8 ఫోర్లు, 2 సిక్సులతో వచ్చినవే. మరో ఓపెనర్ షఫాలీ వర్మ 27 పరుగులు చేసింది. కేవలం 10.5 ఓవర్లలోనే భారత బ్యాటర్లు టార్గెట్ ను ఫినిష్ చేశారు. ఓవరాల్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నేతృత్వంలోని భారత జట్టు వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. దాంతో పాటూ ఏకైక టెస్టులో కూడా విజయ పతాకాన్ని ఎగురవేసింది. Also Read:Amabani’s Marriage: హల్దీలో పూల దుప్పట్టాతో మెరిసిన రాధికా మర్చంట్ #team-india #south-africa #womens-cricket మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి