ఇది మన డీఎన్‌ఏలోనే ఉంది.. ‘ఉచిత’ పథకాలపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

'ఉచిత' పథకాల పేరుతో పోటాపోటీ రాజకీయాలు చేయడం మంచిది కాదని భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ హెచ్చరించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇది మన డీఎన్‌ఏలోనే ఉంది.. ‘ఉచిత’ పథకాలపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
New Update

రాజకీయ నాయకులు ప్రవేశ పెడుతున్న 'ఉచిత' పథకాలపై భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉచితాల పేరుతో పోటాపోటీ రాయకీయాలు చేయడం సమాజానికి మంచిది కాదని, ప్రజల జేబులు నింపడంకంటే వారిని మరింత శక్తివంతంగా తయారు చేయడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం (Human Rights Day) సందర్భంగా ‘భారత మండపం’లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ (NHRC) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. దీర్ఘకాలంలో దీని ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. భారత్‌ మాదిరిగా ప్రపంచంలో ఏ ప్రదేశమూ మానవ హక్కులతో విరాజిల్లడం లేదని స్పష్టం చేశారు. ‘మానవ హక్కుల్లో ప్రపంచంలో ఏ భాగం కూడా భారత్‌ మాదిరిగా విరాజిల్లడం లేదు. మన నాగరికత, రాజ్యాంగ రూపకల్పన అనేవి మానవ హక్కులను గౌరవించడం, పరిరక్షించడం, పెంపొందించడంలో మన నిబద్ధతను చాటిచెబుతున్నాయి. ఇది మన డీఎన్‌ఏలోనే ఉంది’ అని ఆయన తెలిపారు. ఇక రాజకీయాల్లో పోటాపోటీగా చూస్తున్న ఉచితాలపై స్పందించిన ఉపరాష్ట్రపతి.. ‘జేబులకు భరోసా ఇవ్వడం అనేది ఆర్థికంగా ఆధారపడటాన్ని పెంచుతుంది' అన్నారు.

అలాగే మనం ప్రస్తుతం చూస్తున్న ఉచిత రాజకీయాలు కేవలం వ్యయ ప్రాధాన్యతలను వక్రీకరించడమే. దిగ్గజ ఆర్థిక నిపుణుల ప్రకారం, ఉచితాలు అనేవి స్థూల ఆర్థిక స్థిరత్వం ప్రాథమిక సూత్రాన్ని బలహీనపరుస్తాయి’ అని ధన్‌ఖడ్‌ వెల్లడించారు. దీర్ఘకాలంలో జీవన ప్రమాణాలను మెరగుపరచడం, ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రోత్సాహం ఎంత భారం అనే విషయాలపై జాతీయ స్థాయిలో ఆరోగ్యకరమైన చర్చ జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ‘అమృత్‌ కాల్‌’ సమయంలోనే యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (UDHR) కూడా 75వ వార్షికోత్సవాన్ని చేసుకోవడం యాదృచ్ఛికమని జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : ఇతనే నా రాజకీయ వారసుడు.. కీలక ప్రకటన చేసిన మాయావతి

#free-schemes #jagdeep-dhankhar #human-rights-day
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe