Ayodhya Ram Mandir: అయోధ్యకు వెళ్ళేందుకు తెలుగు వారికోసం రెండు ప్రత్యేక రైళ్ళు

జనవరి 22న జరిగే రామలల్లా ప్రతిష్టాపన కోసం దేశం అంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. దీనికోసం శరవేగంగా ఏర్పాట్లు జరిపోతున్నాయి. సంక్రాంతి రోజున మొదలయ్యే ఉత్పవాలు పదిరోజుల పాటూ కొనసాగనున్నాయి. ఇక ఈ క్రమంలో తెలుగురాష్ట్రాల వాళ్ళ కోసం రెండు రైళ్ళు అయోధ్యకు వెళ్ళనున్నాయి.

New Update
Ayodhya Ram Mandir: అయోధ్యకు వెళ్ళేందుకు తెలుగు వారికోసం రెండు ప్రత్యేక రైళ్ళు

Trains to Ayodhya: తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇక మీదట నేరుగా అయోధ్య వెళ్ళి శ్రీరాముని దర్శించుకోవచ్చును. జనవరి 22న ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీతో (PM Modi) పాటు నాలుగు వేల మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు రైళ్లు అయోధ్యకు వెళ్లనున్నాయి. అయోధ్య రాముడిని దర్శించుకోవడానికి దేశవిదేవాల నుంచి భక్తులు తరలి రానున్నారు. ఇప్పటికే శ్రీరాముల వారికి చాలా మంది డబ్బులు విరాళంగా పంపించారు. దానికి తోడు వెలకట్టలేని బహుమతులు కూడా అమోధ్యకు చేరుకుంటున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా డైరెక్ట్ ట్రైన్స్ రావడంతో ఇక్కడి నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తులో తరలి వెళ్ళనున్నారు.

Also Read:కరోనా బీభత్సం…ఒక్క నెలలోనే 10వేల మరణాలు

కాచిగూడ మీదుగా గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (Gorakhpur Express)
యశ్వంతపుర నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే రైలు (15024) కాచిగూడ (Kachiguda) మీదుగా అయోధ్యకు వెళ్తుంది. ప్రతి శుక్రవారం ఉదయం 10.50 నిమిషాలకు గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (15024) కాచిగూడలో బయల్దేరుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ధర్మవరం, అనంతపురం, కర్నూలు సిటీ, మహబూబ్ నగర్, కాచికూడా, ఖాజీపేట, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది. మొత్తం ఒకటిన్నర రోజుల పాటూ ఇందులో ప్రయాణించాల్సి ఉంటుంది.

శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ (Sethu Express)
అలాగే తమిళనాడు లోని రామేశ్వరం నుంచి విజయవాడ (Vijayawada) మీదుగా శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ (22613) కూడా అయోధ్యకు వెళ్తుంది. ఈ రైలు విజయవాడలో ప్రతి సోమవారం రాత్రి 8.10 గంటలకు బయల్దేరి 1813 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం తెల్లవారుజామున 4.00 అయోధ్య జంక్షన్‌కు చేరుకుంటుంది. గూడూరు, విజయవాడ, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.

100 రోజుల పాటూ వెయ్యి ప్రత్యేక రైళ్ళు
అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు జనం పోటెత్తుతున్నారు. దేశ నలుమూలల నుంచి భారీ ఎత్తున జనం తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు రైలు మార్గంలో అయోధ్య (Ayodhya) చేరుకునేందుకు వీలుగా మరిన్ని రైళ్ళు పెంచుతామని చెబుతోంది రైల్వేశాఖ. రామ మందిరం ప్రారంభం తర్వాత 100 రోజుల పాటూ దేశంలోని పలుచోట్ల నుంచి వెయ్యి రైళ్ళు ప్రత్యేకంగా నడుపుతామని తెలిపింది. దీనికి సబంధించిన ప్రకటనను తర్వరలోనే విడుదల చేస్తామని అంటోంది. ఎక్కడెక్కడ నుంచి ఏఏ రైళ్ళు వెళతాయో విరాలతో సమా తెలియజేస్తామని చెబుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు