NRI Murder: ఇన్సూరెన్స్‌ డబ్బులు కోసం ఎన్నారై కోడల్ని హత్య చేసి ఫ్రిడ్జ్‌ లో పెట్టిన అత్తమామలు!

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కోడలిని చంపి ఫ్రిడ్జ్‌ లో దాచిపెట్టిన ఘటన పంజాబ్‌ లో వెలుగులోకి వచ్చింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోనికి తీసుకున్నారు.

NRI Murder: ఇన్సూరెన్స్‌ డబ్బులు కోసం ఎన్నారై కోడల్ని హత్య చేసి ఫ్రిడ్జ్‌ లో పెట్టిన అత్తమామలు!
New Update

NRI Murder: ఇన్సూరెన్స్ డబ్బులు (Insurence Murder)  కోసం కోడలిని హత్య చేసి రెండు రోజుల పాటు ఫ్రిజర్ (Frizer) లో పెట్టారు అత్తమామలు(In Laws). ఆ తరువాత ఆమె గుండె పోటుతో చనిపోయినట్లు బ్రిటన్‌లో ఉన్న కోడలి తల్లికి ఫోన్‌ చేసి తెలిపారు. దీంతో ఆమె కూతురు మరణం పట్ల అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బీమా డబ్బులు కోసం కోడల్ని చంపి విషయాన్ని దాచిపెట్టినట్లు బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పంజాబ్‌ కి చెందిన అమెరికా పౌరురాలు రాజ్‌దీప్‌ కౌర్‌ (32)ను కపుర్తలాలోని నానో మల్లియన్‌ గ్రామంలో ఉన్న దల్జీత్ కౌర్, జగదేవ్ సింగ్‌లు బంధువులు పెళ్లి సాకుతో ఇండియాకి రప్పించారు. రాజ్ దీప్ తన ఐదు సంవత్సరాల కుమారుడ్ని తీసుకుని అత్తమామల ఇంటికి వచ్చింది.

రెండు రోజుల పాటు ఫ్రిజర్‌ లో దాచి..

జనవరి 19న అత్తమామలు ఆమెను ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తరువాత రాజ్‌ దీప్‌ మృతదేహన్ని రెండు రోజుల పాటు ఫ్రిజర్‌ లో దాచి పెట్టారు. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులకు రాజ్‌దీప్ గుండె పోటుతో చనిపోయినట్లు సమాచారం అందించారు. దాంతో వారు బ్రిటన్‌ నుంచి భారత్‌ కు వచ్చారు. కూతురు మృతి పై వారు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు ఆమె భర్త మీద కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజ్‌దీప్ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించగా ఆమె ఊపిరి ఆడకుండా చనిపోయినట్లు తెలిసింది. దీంతో తమదైన శైలిలో అత్తమామలను ప్రశ్నించగా..వారు అసలు విషయాన్ని చెప్పారు. బీమా డబ్బులు కోసం కోడల్ని చంపినట్లు ఒప్పుకున్నారు. అంతేకాకుండా రాజ్‌ దీప్‌ భర్త కూడా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె బీమా డబ్బులతో అతను గ్రీన్ కార్డ్‌ పొందాలని చూస్తున్నట్లు అసలు విషయం తెలిసింది. భార్య హత్యలో భర్త పాత్రకూడా ఉందని తెలిసింది.

Also read: మాల్దీవుల అధ్యక్షుడి పై అభిశంసన తీర్మానం..సిద్దమైన ప్రతిపక్షం!

#international #fridge #murder #national #crime #inlaw
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి