విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో 275 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ఇండియన్ నేవీ విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 275 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనుండగా అర్హులైన అభ్యర్థులు 2024 జనవరి 01వరకూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది.

New Update
విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో 275 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

నిరద్యోగులకు ఇండియన్ నేవీ విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్ శుభవార్త అందించింది. ఫిట్టర్, మెకానిక్ (డీజిల్), ఎలక్ట్రీషియన్, పెయింటర్ (జనరల్), మెషినిస్ట్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు కింద సూచించిన విధంగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

ఈ పోస్టులకు ఫిబ్రవరి 28, 2024న రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో వచ్చిన మార్కులు, ఎస్ఎస్సీ/ మెట్రిక్యులేషన్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా 70:30 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం మెరిట్ జాబితా రూపొందించి ఫలితాలు ప్రకటించారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ప్రకారం అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ (MSDE) కోసం గరిష్ట వయోపరిమితి లేదని అధికారులు తెలిపారు. అభ్యర్థులకు కనిష్ట వయో పరిమితి 14 సంవత్సరాలు ఉండాలి. ప్రమాదకర వృత్తుల కోసం, కనీస వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు.అభ్యర్థులు కనీసం 55% మొత్తంతో SSC/ మెట్రిక్యులేషన్ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు కనీసం 65 % మార్కులతో ITI (NCVT/SCVT) ఉత్తీర్ణులై ఉండాలి.

Also read :సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. ఆ రోజు పనిచేయకపోయిన వేతనాలు

దరఖాస్తు చేసుకోవడం కోసం.. apprenticeshipindia.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. అడిగిన వివరాలు నమోదు చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేయండి భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకోండి. పూర్తి చేసిన దరఖాస్తును విశాఖ నేవల్ డాక్ యార్డ్ అడ్రస్ పంపించాలి. (The Officer-in-Charge (for Apprenticeship), Naval Dockyard Apprentices School, VM Naval Base S.O, P.O, Visakhapatnam-530 014, Andhra Pradesh)

అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 2024 జనవరి 01. అన్ని ట్రేడ్‌లకు రాత పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 28 ఫలితాలు విడుదల చేస్తారు. మార్చి 02 ఇంటర్య్వూ నిర్వహించి.. 05న ఇంటర్వ్యూ ఫలితాలు రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ 14 వైద్య పరీక్షల తేదీ. మే 1 నుంచి అప్రెంటిస్‌లకు ఏడాది పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో నెలకు రూ.7,700 నుంచి రూ.8,050 వరకు స్టైపెండ్‌ ఇస్తారు.

Advertisment
తాజా కథనాలు