Indian Navy Jobs : ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. మరో 11 రోజులే ఛాన్స్‌!

ఇండియన్‌ నేవీ లో 910 సివిలియన్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకి అర్హులని ఇండియన్‌ నేవీ పేర్కొంది.

Indian Navy Jobs : ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. మరో 11 రోజులే ఛాన్స్‌!
New Update

Alert : ఇండియన్‌ నేవీ(Indian Navy) లో 910 సివిలియన్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌(Notification) విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకి అర్హులని ఇండియన్‌ నేవీ పేర్కొంది. వీటిని ఇండియన్‌ నేవీ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా పూరించనున్నారు. అర్హత ఉన్న ఆసక్తిగల యువతీయువకులు ఈ ఉద్యోగాల కోసం ఆన్‌ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

ఛార్జ్‌మెన్‌ వర్క్‌షాప్‌ పోస్టుల వివరాలు..ఇందులో మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. దీనికి కావాల్సిన విద్యార్హతలు..బీఎస్సీ మ్యాథ్స్‌/ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ చదివి ఉండాలి. లేక కెమికల్‌ ఇంజినీరింగ్‌ లో డిప్లొమా పూర్తి చేసి అయినా ఉండాలి.

ఛార్జ్‌మెన్‌ ఫ్యాక్టరీ పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.20 ఛార్జ్‌మెన్‌ ఫ్యాక్టరీకు కావాల్సిన విద్యార్హతలు..బీఎస్సీ మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ చదువు పూర్తి చేసి ఉండాలి. లేకపోతే ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్‌/కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తి చేసి అయిన ఉండాలని అధికారులు చెబుతున్నారు.

సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులకు కూడా నేవీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి కావాల్సిన విద్యార్హతలు ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ కార్టోగ్రాఫిక్‌ వంటి విద్యను అభ్యసించి ఉండాలి.

సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ కు కావాల్సిన విద్యార్హతలు..పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. రెండేళ్ల డిప్లొమా, డ్రాఫ్ట్‌మెన్‌షిప్‌ లో ఐటీఐ సర్టిఫికేట్‌ ఉండాలి. దరఖాస్తు చేసుకున్న విభాగం ప్రకారం..ఎలక్ట్రికల్‌/మెకానికల్‌/ నేషనల్‌ ఆర్కిటెక్చర్‌/కార్టోగ్రఫీ వీటిలో ఎందులో అయినా సరే మూడేళ్లు డ్రాయింగ్‌/ డిజైన్‌ అనుభవం తప్పనిసరిగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

డ్రాఫ్ట్స్‌మెన్‌ మేట్‌ పోస్టుల వివరాలు...వెస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌--565 సదరన్‌ నేవల్‌ కమాండ్‌- 36 ఈస్టర్న్‌ నేవల్ కమాండ్‌ -9 పోస్టులు ఉన్నాయి. దీనికి కావాల్సిన విద్యార్హతలు.. పదో తరగతి పాస్‌ అవ్వడంతో పాటు ఐటీఐ నిర్దేశిత ట్రేడుల్లో సర్టిఫికేట్‌ తప్పనిసరి ఉండాలి. ఈ పోస్టులను అప్లై చేసుకునేందుకు 2023 డిసెంబర్‌ 31 నాటికి సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్‌ లకు 27 ఏళ్లు మించకూడదు. ఛార్జ్‌మెన్‌,,ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ పోస్టులకు అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.

ఇందులో ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో పరిమితి సడలింపులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులకు అప్లికేషన్‌ ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. మిగతా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ. 295 లను చెల్లించాల్సి ఉంటుంది. 2023 డిసెంబరు 31 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరిస్తారు.పూర్తి వివరాల కోసం భారత నేవీ అధికారిక వెబ్​సైట్​ https://www.joinindiannavy.gov.in/ను చూడవచ్చు.

Also read: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్!

#degree-qualification #indian-navy #jobs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe