Accident : ఆస్ట్రేలియాలో ఘోరం.. రైలు ఢీకొని భారతీయ టెకీ.. కుమార్తె మృతి! ఆస్ట్రేలియాలో రైలు ఢీకొట్టడంతో భారతీయ టెకీ తో పాటు అతని కవలల కుమార్తెల్లో ఒకరు మృతి చెందారు.భారత్ కు చెందిన ఆనంద్ ఫ్యామిలీతో స్టేషన్‌లోని లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా స్ట్రోలర్ ట్రాక్ పై పడింది.పిల్లల్నిరక్షించే క్రమంలో ఆనంద్ పట్టాలపైకి దూకగా ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 23 Jul 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Train Accident : ఆస్ట్రేలియా (Australia) లో దారుణ ఘటన జరిగింది. రైలు ఢీకొట్టడంతో భారతీయ టెకీ తో పాటు అతని కవలల కుమార్తెల్లో ఒకరు మృతి చెందారు. మరో బిడ్డ తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని కార్ల్టన్ రైల్వే స్టేషన (Carlton Railway Station) లో ఈ దారుణ ఘటన జరిగింది. భారత్ (India) కు చెందిన ఆనంద్ తన కుటుంబంతో స్టేషన్‌లోని లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా పిల్లల స్ట్రోలర్ ట్రాక్ పై పడింది. తన కవల కుమార్తెలను కాపాడేందుకు ట్రాక్‌ల పైకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న రైలు ఢీకొని కవలల్లో ఒకరైన హినాల్ మృతి చెందగా.. మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆనంద్ రన్వాల్‌కు భార్య పూనమ్ రన్వాల్, కవల కుమార్తెలు ఉన్నారు. ఆనంద్ సిడ్నీలోని ఆర్థిక సేవల సంస్థ వెస్ట్‌పాక్‌లో ఐటీ సర్వీస్ ప్రొవైడర్‌గా ఇన్ఫోసిస్ (Infosys) లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన అక్టోబర్ 2023లో ఆస్ట్రేలియాకు వెళ్లారు. జులై 21 ఆదివారం మధ్యాహ్నం కుటుంబం స్టేషన్‌లోని లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా స్ట్రోలర్ ఒక్కసారిగా రైలు పట్టాలపైకి వెళ్లి బోల్తా పడింది. ఆనంద్ తన కుమార్తెలను రక్షించేందుకు పట్టాలపైకి దూకాడు. అయితే అతని కుమార్తెలలో ఒకరైన హినాల్ ఎదురుగా వస్తున్న రైలు ఢీకొని అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదంలో ఆనంద్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడిందని సమాచారం. Also read: టీజీపీఎస్సీ కీలక నిర్ణయం! #indian-national-engineer #infosys #train-accident #australia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి