Republic day:రిపబ్లిక్ డే పరేడ్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

వచ్చే ఏడాది జనవర్ 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంబచ్ అధ్యక్షుడు మాక్కాన్ విశిష్ట అతిధిగా రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటన క్యాన్పిల్ అవడంతో ఫ్రాన్ అధ్యక్షుడిని భారతదేశ ప్రభుత్వం ఆహ్వానించింది.

New Update
Republic day:రిపబ్లిక్ డే పరేడ్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

ఈసారి గనతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా ఫ్రాన్ అధ్యక్సుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ రానున్నారని భారత కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో రిపబ్లిక్ డే పరేడ్ కు భారత దేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు రావడం ఇది ఆరవ సారి అవుతుంది. తరువాత 1950 నుండి భారతదేశం గణతంత్ర దినోత్సవ వేడుకలకు అత్యధిక సంఖ్యలో ఆహ్వానాలను అందుకున్న ఏకైక దేశంగా ఫ్రాన్స్ ప్రత్యేకతను సంపాదించుకుంది. మొదటిసారి 1976లో, ఫ్రాన్స్ మాజీ ప్రధాని జాక్వెస్ చిరాక్ భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడిన మొట్టమొదటి నాయకుడిగా నిలిచారు. తరువాత 1980లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్‌ను రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా భారతదేశం ఆహ్వానించింది. దీని తరువాత 1998లో అప్పటి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ జాక్వెస్ చిరాక్‌ వచ్చారు. 2016లో ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండే భారత రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరు కాగా, 2008లో అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని ఆ కార్యక్రమానికి అతిథిగా దేశం ఆహ్వానించింది. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఇమాన్యెయెల్ మాక్రాన్ కూడా చేరారు.

Also read:7 నెలల తర్వాత ఒకేరోజు కోవిడ్ తో ఆరు మరణాలు

ఇక ఈ ఏడాది ఆరంభంలో బారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం అయిన బాస్టిల్ డే పరేడ్ కు ఛీఫ్ గెస్ట్ గా వెళ్ళారు. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ లో ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు మెక్రాన్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాస్టిల్ డే పరేడ్ కు మోదీ హాజరు కావడాన్ని తమ దేశ ప్రజలు గౌరవంగా భావిస్తున్నారని చెప్పారు.

అసలు ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రావాల్సి ఉంది. అయితే పలు కారనాల వల్ల ఆయన అటెండ్ కాలేకపోతున్నారని అమెరికా వైట్ హౌస్ అధ్యక్సులు తెలిపారు. దీంతో ఆ స్థానంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఆహ్వానించింది భారత ప్రభుత్వం.

Advertisment
తాజా కథనాలు