Faridabad:భారత వైద్యులు చేయలేని పని లేదని నిరూపిస్తున్నారు. ఇప్పటికే చాలా అరుదైన ఆపరేషన్లు చేసి మనుషులు ప్రాణాలు కాపాడుతున్న భారత వైద్యులు ఇప్పుడు మరో ఫీట్ సాధించారు. ఇద్దరు వ్యక్తులకు చేతులను అమర్చారు. ఈ అరుదైన సంఘటప హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అమృత ఆసుపత్రిలో జరిగింది. ఉత్తర భారతదేశంలో ఇలాంటి ఆరేషన్ జరగడం ఇదే మొదటిసారి.
Also Read:ఎక్స్‌లో కొత్త ఫీచర్…ఆడియో, వీడియో కాల్స్
ఫరీదాబాద్ అమృతా ఆసుపత్రి వైద్యుల ఘనత..
ఫరీదాబాద్‌లో ఇద్దరు వ్యక్తులకు ఒకేసారి చేతులను అమర్చారు అక్కడి వైద్యులు. 17 గంటల్లో ఈ ఆపరేషన్లు పూర్తి చేశారు. మొత్తం భారతదేశంలోనే ఇది మొదటి హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్. ఆపరేషన్ తరువాత పేషంట్లు ఇద్దరూ బాగానే ఉన్నారు. కోలుకుంటున్నారు అని వైద్యులుచెబుతున్నారు.
64 ఏళ్ళ గౌతమ్ తయల్...
ఢిల్లీకి చెందిన గౌతమ్ తయల్ అనే 64 ఏళ్ళ ముసలాయనకు కొన్నేళ్ళ క్రితం యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో ఆయన తన ఎడమ చేతిని కోల్పోయారు. 10 ఏళ్ళ క్రితం ఆయనకు కిడ్నీ మార్పిడి కూడా చేశారు. ఇప్పుడు అదే వ్యక్తికి మరొకరి చేతిని అమర్చారు. 40 ఏళ్ళ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి చేతిని గౌతమ్‌కు అతికించారు. గౌతమ్ అతికించిన చేయి ఇప్పుడు పనిచేస్తోంది. ఆయన తన చేతి వేళ్ళను కదిలించగలుగుతున్నాడు కూడా. త్వరలోనే గౌతమ్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కూడా చేస్తామని చెబుతున్నారు వైద్యులు. రెండు అవయవాలు మార్పిడి చేయించుకున్న వ్యక్తిగా గౌతమ్ తయల్ రికారడ్ సృష్టించారు. దేశంలో ఇతనే మొదటి వ్యక్తి అయితే...ప్రపంచంలో రెండో వ్యక్తి గౌతమ్ తయల్ కావడం విశేషం.
19 ఏళ్ళ దేవాన్ష్...
ఇక మరో ఆపరేషన్ కేవలం 19 ఏళ్ళు యువకుడికి జరిగింది. దేవాన్స్ గుప్తా అనే కుర్రాడు కూడా యాక్సిడెంట్‌లో చేతిని పోగొట్టుకున్నాడు. ఇతను తన రెండు చేతులనూ కోల్పోయాడు. సేమ్ అదే అమృత ఆసుపత్రి డాక్టర్ల బృందమే దేవాన్స్‌కు కూడా హ్యండ్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఇతనికి కూడా బ్రెయిన్ డెడ్‌తో తచనిపోయిన 33ఏళ్ళ వ్యక్తి చేతులను అతికించారు. గతేడాది డిశంబర్‌లో దేవాన్స్‌కు ఆపరేషన్ జరిగింది. ఇతను కూడా ఇప్పుడు కోలుకుంటున్నాడు.