Oman: ఒమాన్‌లో భారీ కాల్పులు.. ఆరుగురు మృతుల్లో భారతీయుడు

ఒమాన్ రాజధాని మస్కట్‌లో సోమవారం షియా మసీదు సమీపంలో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరణించిన వారిలో భారత్‌కు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని ఒమాన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. 

New Update
Oman: ఒమాన్‌లో భారీ కాల్పులు.. ఆరుగురు మృతుల్లో భారతీయుడు

ఒమాన్ రాజధాని మస్కట్‌లో దారుణం జరిగింది. సోమవారం షియా మసీదు సమీపంలో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అయితే మరణించిన వారిలో భారత్‌కు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని ఒమాన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ దాడిలో నలుగురు పాకిస్థానీయులతో పాటు ఇద్దరు చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరో 30 మంది గాయాలపాలైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఒక భారతీయుడు మృతి చెందగా.. మరో భారతీయుడు గాయపడ్డారని ఒమాన్‌ విదేశాంగ శాఖ ఇండియన్ ఎంబసీకి తెలియజేసింది.

Also Read: మందుబాబులకు గుడ్‌న్యూస్.. త్వరలో లిక్కర్‌ హోం డెలివరీ..

మరోవైపు ఈ దాడిని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అక్కడ మరణించిన తమ దేశస్థుల మృతదేహాలను పాకిస్థాన్‌కు తీసుకొచ్చేందుకు ఒమాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. ప్రొపెట్ మహమ్మద్ మనుమడు హుస్సేన్ 7వ శతాబ్దపు బలిదానం జ్ఞాపకార్థం అషురా వేడుక సందర్భంగా ఈ కాల్పులు జరిగాయి. ఈ దాడికి పాల్పడ్డ ముగ్గురు ముష్కరులను పోలీసులు హతం చేశారు. ఈ దాడి వెనుక ఎవరున్నారనే దానిపై ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.

Also read: కుక్కలపై అత్యాచారం చేసి చంపిన కేసులో ఓ వ్యక్తికి 249 ఏళ్ల జైలుశిక్ష!

Advertisment
తాజా కథనాలు