Indian 2 Movie: అగ్రనటుడు కమల్ హాసన్ (Kamal Haasan), శంకర్ (Shankar) కాంబోలో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం 'ఇండియన్ 2'. జులై 12న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ అతి తక్కువ సమయంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేసింది.
ఇది ఇలా ఉంటే.. తాజాగా 'ఇండియన్ 2' చిత్రనిర్మాతలకు ఊహించని షాక్ తగిలింది. ఈ చిత్రం న్యాయపరమైన చిక్కులో పడింది. చిత్ర నిర్మాతలు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లీగల్ నోటీసులు జారీ చేసింది. అయితే మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హిందీలో సినిమాలను విడుదల చేయడానికి కొన్ని నిబంధనలను రూపొందించింది. నిర్మాతలు థియేటర్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్ కు మధ్య కనీసం 8 గ్యాప్ అనుసరించాలని నిర్దేశించింది. ఈ నిబంధనను పాటించని సినిమాలనకు PVRInox, Cinepolis వంటి ప్రధాన జాతీయ మల్టీప్లెక్స్ చైన్‌లలో విడుదల చేసే అవకాశం ఉండదని తెలిపింది.
అయితే 'ఇండియన్ 2' నిర్మాతలు మొదటగా ఈ నిబంధనలకు అంగీకరించి.. ప్రధాన మల్టీప్లెక్స్ చైన్‌లలో విడుదలకు అవకాశం పొందారు. కానీ విడుదల తర్వాత నిబంధనలను ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం.. జులై 12న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రావాలంటే 8 వారాల గ్యాప్ అనుసరించాలి. కానీ మేకర్స్ దీనికి విరుద్ధంగా 6 వారాల్లోన్నే 'ఇండియన్ 2' హిందీ స్ట్రీమింగ్ అందుబాటులోకి తెచ్చారు. దీంతో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ 'ఇండియా 2 'నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేసింది.
Also Read: Mathu Vadalara 2 Teaser: 'మత్తు వదలరా 2'.. వినోదాత్మకంగా టీజర్ - Rtvlive.com