Indian 2 : 'ఇండియన్ 2' కు 'A' సర్టిఫికెట్.. రన్ టైం అన్ని గంటలా?

'ఇండియన్ 2' కూడా భారీ రన్ టైం తోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఏకంగా 3 గంటల 10 నిమిషాల నిడివి వచ్చిందట. అంతేకాదు, సినిమాకు సెన్సార్‌వారు 'A' సర్టిఫికెట్‌ ఇచ్చారట. సినిమాలో హింస ఎక్కువ ఉండటంతో సెన్సార్ టీం 'A' సర్టిఫికెట్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.

New Update
Indian 2 : 'ఇండియన్ 2' కు 'A' సర్టిఫికెట్.. రన్ టైం అన్ని గంటలా?

Indian 2 Movie Run Time And Censor Report : కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2′. 90’s లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు) మూవీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా.. ఇటీవలే సాంగ్స్ కూడా వదిలారు.అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే నెల 12 న రిలీజ్ కానుంది. తెలుగులో 'భారతీయుడు 2' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ రిపోర్ట్, రన్ టైం వివరాలు బయటికొచ్చాయి.

Also Read : షారుఖ్ ఖాన్ సరసన సమంత.. క్రేజీ కాంబో సెట్ చేసిన స్టార్ డైరెక్టర్!

'A' సర్టిఫికెట్...

మాములుగా శంకర్ సినిమాలన్నీ ఎక్కువ రన్ టైం తోనే ఉంటాయి. అలాగే 'ఇండియన్ 2' కూడా భారీ రన్ టైం తోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబందించి ఇప్పటికే ఓవర్సీస్‌లో బుకింగ్స్‌ మొదలయ్యాయి. అక్కడి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. 'ఇండియన్ 2' కి ఏకంగా 3 గంటల 10 నిమిషాల నిడివి వచ్చిందట. అంతేకాదు, సినిమాకు సెన్సార్‌వారు 'A' సర్టిఫికెట్‌ ఇచ్చారట. సినిమాలో హింస ఎక్కువ ఉండటంతో సెన్సార్ టీం 'A' సర్టిఫికెట్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు.

Advertisment
తాజా కథనాలు