Cricket: మొదటి మ్యాచ్‌లో శ్రీలంక మీద భారత్‌ ఘన విజయం

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సీరీస్‌లో టీమ్ ఇండియా అద్భుతమైన బోణీ కొట్టింది. మొదట మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

New Update
Cricket: మొదటి మ్యాచ్‌లో శ్రీలంక మీద భారత్‌  ఘన విజయం

India Vs Srilanka T20 series: మన క్రికెటర్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. వన్డే వరల్డ్ కప్ నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆడుతున్నారు. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న టీ20 సీరీస్‌లో కూడా మొదటి మ్యాచ్‌లో విజయాన్ని సాధించారు. శ్రీలంకపై టీమ్‌ఇండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు ఓపెనర్లు గిల్, జైస్వాల్‌లు శుభారంభాన్ని ఇచ్చారు. జైస్వాల్ 21 బంతుల్లో 40 పరుగులు చేయగా..శుభ్‌మన్‌ 16 బంతుల్లో 34 పరుగులు చేసి చెలరేగిపోయారు. వీళ్ళిద్దరి తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 58 పరుగులు, 33 బంతుల్లో 49 పరుగులు చేసిభారత్‌కు 213 పరుగుల భారీ స్కోరును ఇచ్చారు. శ్రీలంక బౌలర్లలో పతిరన 4, దిల్షాన్‌ 1, ఫెర్నాండో 1, హసరంగ 1 వికెట్‌ తీశారు.

ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంకసేన కొంతవరకు భారత బౌలర్లను ధీటుగానే ఎదుర్కొన్నారు. నిశాంక (79 పరుగులు; 48 బంతుల్లో), కుషాల్‌ మెండిస్‌ (45 పరుగులు; 27 బంతుల్లో) చెలరేగి ఆడారు. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు పడడంతో శ్రీలంక ఓటమిని మూటగట్టుకుంది. భారత బౌలర్లు విజృంభించడంతో 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. 43 పరుగుల తేడాతో టీమ్‌ ఇండియా విజయం సాధించింది. రియాన్‌ పరాగ్‌ 3, అర్ష్‌దీప్‌ సింగ్‌ 2, అక్షర్ పటేల్‌ 2, సిరాజ్‌ 1, బిష్ణోయ్‌ 1 వికెట్‌ తీశారు.

Also Read:Paris Olympics: ఒలింపింక్స్‌లో బోణీ కొట్టిన భారత పురుషుల హాకీ జట్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు