Pakistan : భారత్(India) లో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ సెనేటర్ ఫైజల్ అబిదీ(Faisal Abidi).. భారత అంతర్గత వ్యవహారాలు, ప్రధాని మోదీ(PM Modi) నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నవంబర్ నాటికి భారత్ ముక్కులుగా విడిపోతుందని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న హిందుత్వ అజెండా, ఆయనకు భారత్ నుంచి వస్తున్న విశేష ఆధరణపై ఫైజల్‌ను ప్రశ్నించారు. దీనికి ఫైజల్ బదిలిస్తూ.. ' భారత్ తమ పార్లమెంటులో అఖండ భారత్ చిత్రాన్ని పెట్టినప్పుడు నేపాల్, శ్రీలంక, భూటాన్, పాకిస్థాన్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాకిస్థాన్ దీని గురించి మాట్లాడినప్పుడు మాపై ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు అదే నిజమని తేలింది.
Also read: కర్ణాటక బళ్లారిలో ఏసీ బ్లాస్ట్..
2026 నవంబర్ 26న.. ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. మోదీ హిందుత్వ ఎజెండా నుంచి ప్రజలను బయటకు తీసుకురావడమే వారిని రక్షించగల ఏకైక మార్గం. ఏజెన్సీల ద్వారా సమస్యలు ఏర్పడతాయి. కానీ మోదీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం భారత్ నాశనమవుతుందని' ఫైజల్ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్ గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ముందు మీ దేశం గురించి దృష్టి పెట్టడంని నెటీజన్లు ఫైజల్‌కు చురకలింటిస్తున్నారు.