Cricket:సూపర్ విక్టరీతో డబ్ల్యూటీసీ పట్టికలో టాప్ ప్లేస్‌కు భారత్ కేప్‌టౌన్‌లో నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఐదో స్థానం నుంచి భారత్ మొదటి ప్లేస్‌కు జంప్ చేసింది. By Manogna alamuru 05 Jan 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి నిన్నటి చారిత్రక విజయం టీమ్ ఇండియాకు ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుందిన అనడంలో ఎటువంటి సందేహం లేదు. వరల్డ్కప్ దగ్గర నుంచి వరుస ఓటములతో బాధపడుతున్న టీమ్ ఇండియా నిన్న టెస్ట్ మ్యాచ్ గెలుపుతో గర్వంగా తలెత్తుకుంది. దీంతో పాటూ టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ పట్టికలో మొదటి స్థానాన్నికి కూడా ఎగబాకింది. 54.16 శాతం పాయింట్లతో భారత జట్టు.. ఐదో స్ధానం నుంచి టాప్ ప్లేస్‌కు దూసుకెళ్ళింది. ఇక భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన సౌతాఫ్రికా 50 శాతం పాయింట్లతో రెండో స్ధానానికి పడిపోయింది. వీటి తర్వాతి స్ధానాల్లో న్యూజిలాండ్(50.0), ఆస్ట్రేలియా(50.0),బంగ్లాదేశ్(50.0) పాకిస్తాన్(45.83) ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య టెస్ట్ సీరీస్ జరుగుతోంది. ఇందులో రెండు టీమ్‌లు మూడో టెస్టు ఆడుతున్నాయి. దీని తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. మూడో టెస్ట్‌లో ఆసీస్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరే ఛాన్స్ ఉంది. Also Read:ప్రజాపాలన దరఖాస్తులకు రేపే అఖరి రోజు..కీలక అప్డేట్ ఇచ్చిన ప్రభుత్వం ఇండియా-సౌత్ ఆఫ్రికాల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా రికార్డ్‌కు ఎక్కింది. దీంతో కేప్‌టౌన్ పిచ్ మీద కూడా బోలెడంత చర్చ జరుగుతోంది. ఈ పిచ్‌పై పేసర్లు అద్బుతాలు సృష్టించారు. ఒకటిన్నర రోజుల్లోనే 33 వికెట్లు నేలకూలాయి. ఇదే విషయం మీద మ్యాచ్ తరువాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. భారత్ పిచ్‌లపై విమర్శలు చేసే వారికి రోహిత్ గట్టి కౌంటరిచ్చాడు.ఇది కూడా క్రికెట్ పిచే కదా. ఆడింది మ్యాచే కదా! మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందొ కనబడిందనే అనుకుంటున్నా. మరి దీనికేం రేటింగ్ ఇస్తారు? భారత్‌లో ప్రపంచకప్ ఫైనల్ కోసం తయారు చేసిన పిచ్‌పై ఓ బ్యాటర్ సెంచరీ చేసినా దానికి ‘యావరేజ్’ రేటింగ్ ఇస్తారు.ఇవెక్కడి రూల్స్ అంటూ మండిపడ్డాడు. నాకు ఎలాంటి పిచ్‌ల మీద ఆడడానికైని ఇబ్బంది లేదు. కానీ బారత్ పిచ్‌లను యవరేజ్, చెత్త అంటేనే ఇబ్బందిగా ఉంటుందని అన్నాడు. #cricket #india #wtc #test-ranking #first-place మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి