Ind Vs WI: చెత్త ప్రయోగాలతో కొంప కొల్లేరు చేశారుగా.. ప్చ్..ఏంటి భయ్యా ఇది!

భారత్‌ ఖేల్‌ ఖతమైంది. డిసైడర్‌ టీ20 ఫైట్‌లో టీమిండియా ఆటగాళ్లు చేతులెత్తేశారు. పాండ్యా జట్టును 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన రోవ్‌మన్ పావెల్ టీమ్‌ టీ20 సిరీస్‌ని 3-2 తేడాతో గెలుచుకుపోయింది. 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విండీస్‌కు భారత్‌పై ఇదే తొలి టీ20 సిరీస్‌ విక్టరీ.

Ind Vs WI: చెత్త ప్రయోగాలతో కొంప కొల్లేరు చేశారుగా.. ప్చ్..ఏంటి భయ్యా ఇది!
New Update

Brandon King guide West Indies to 1st T20I series win vs India in over 6 years: సిరీస్‌ పోయింది.. అస్సాం అయ్యింది.. మొదటి రెండు టీ20లు లైట్‌ తీసుకుని పాచిపోయిన కిచిడీ బుర్రతో చెత్త చెత్త ప్రయోగాలు చేసిన టీమిండియా.. ఐదో టీ20లో ఓడిపోయి సిరీస్‌ని కోల్పోయింది. డిసైడర్‌ టీ20 ఫైట్‌లో విండీస్‌(west indies) చెలరేగిపోయింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో పాండ్య సేనను ఇంటికి సాగనంపింది. టెస్టులు, వన్డేలు గెలిచిన భారత్‌.. టీ20 సిరీస్‌ మాత్రం గెలవలేకపోయింది. విండీస్‌ ర్యాంక్‌ని చూసి టీ20ల్లో తక్కువ అంచనా వేస్తే ఏం అవుతుందో.. ద్రవిడ్‌, పాండ్యాకు తెలిసి వచ్చింది. ఎక్స్‌పిరిమెంట్లు చేయొచ్చు కానీ.. ఇదేదో కెమిస్ట్రీ ల్యాబ్‌ లెవల్‌లో చేయకూడదు.. అది కూడా మొదటి రెండు టీ20ల్లో ప్రయోగాలు చేస్తారా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో మొదటి రెండు టీ20లు ఎంత ముఖ్యమో తెలియదా అని ఫైర్ అవుతున్నారు.



బ్యాటింగే కొంపముంచిందా?

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు స్టార్టింగ్‌లోనే గట్టిదెబ్బ తగిలింది. నాలుగో టీ20లో రెచ్చిపోయిన యశస్వి(yashasvi), శుభ్‌మన్‌ గిల్‌(gill) ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన టీ20 బాస్‌ సూర్య, జూనియర్‌ యువరాజ్‌ తిలక్‌ వర్మ జట్టును ఆదుకున్నారు. ఛాన్స్‌ చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ జోడికి రోస్టన్‌ ఛేస్‌ బ్రేకులు వేశాడు. 18 బంతుల్లో 27 రన్స్ చేసిన తిలక్‌ ఛేస్‌ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్‌ కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఇక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆడుతున్నది టీ20 అన్న విషయం మరిచిపోయి 18 బాల్స్‌ తిని 14 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. పాండ్యా కారణంగానే అప్పటివరకు ఉన్న మూమెంటమ్‌ దెబ్బతింది. ఓవైపు వికెట్లు పడుతున్నా సూర్య తనదైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 45 బంతుల్లో 61 పరుగులు చేసిన సూర్య కారణంగానే టీమిండియా 20ఓవర్లలో 165 పరుగులు చేయగలిగింది.



టార్గెట్‌ ఉఫ్‌:

లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌ ప్రారంభించిన విండీస్‌కు ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ దిమ్మదిరిగే స్టార్ట్ ఇచ్చాడు. భారత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్ మేయర్స్ అవుటైనా.. పూరన్‌ సాయంతో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. అటు పూరన్‌ కూడా తన ఫామ్‌ని కొనసాగించాడు. ఈ ఇద్దరి ధాటికి టీమిండియా ఓటమి ముందే కన్ఫమ్ ఐపోయింది. చివరిలో పూరన్‌ అవుటైనా తర్వాత బ్యాటింగ్‌కి దిగిన హోప్‌ కూడా 170 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయడంతో విండీస్‌ని ఆపేవాళ్లు లేకుండా పోయారు. అటు బ్రాండన్‌ కింగ్ 55 బంతుల్లోనే 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విండీస్‌ కేవలం 18ఓవర్లలోనే టార్గెట్‌ని ఫినిష్‌ చేసింది. అది కూడా చేతిలో 8వికెట్లు పెట్టుకొని మరి. 6ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విండీస్‌కు భారత్‌పై ఇదే తొలి టీ20 సిరీస్‌ విక్టరీ!

#hardik-pandya #rahul-dravid #yashasvi-jaiswal #shubman-gill #india-vs-west-indies
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe