India vs South Africa T20 : వరల్డ్‌కప్ ఓటమి బాధను ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్ మరిచిపోతున్నారు. ఏదైనా సందర్భం వస్తే కానీ ఆ ఓటమి పెద్దగా గుర్తురావడం లేదు. క్రికెట్ ఫ్యాన్స్‌కి ఈ ఫీలింగ్స్ కామనే. గెలవడం, ఓడడం ఆటలో భాగం. వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడేసింది టీమిండియా. 4-1 తేడాతో ఆసీస్‌ను ఓడించింది. రోహిత్, కోహ్లీ, రాహుల్ లేకుండానే సత్తా చాటింది. సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) కెప్టెన్సీలో కుర్రాలు అదరగొట్టారు. ఆస్ట్రేలియాపై ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క మ్యాచే ఓడిపోయారు. అది కూడా చివరి ఓవర్లో ప్రసిద్ కృష్ణ చెత్త బౌలింగ్‌తో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఆస్ట్రేలియాపై సిరీస్ గెలుపు తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా ఫ్లైటెక్కింది. రేపటి(డిసెంబర్ 10) నుంచి సఫారీలతో పొట్టు ఫైట్‌కు సై అంటోంది.
పూర్తిగా చదవండి..IND vs SA : టీమిండియాకు సఫారీల సవాల్.. తొలి టీ20కు ప్లేయంగ్ టీమ్ ఇదే!
రేపటి(డిసెంబర్ 10) నుంచి దక్షణాఫ్రికాతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదలవనుంది. సఫారీ గడ్డపై రేపు సాయంత్రం 7:30నిమిషాలకు ప్రారంభంకానన్న తొలి టీ20లో భారత్‌కు సూర్యకుమార్‌యాదవ్ కెప్టెన్సీ వహిస్తున్నాడు.
Translate this News: