Team India : ఇండియాలో క్రికెట్ ఓ మతం. క్రికెట్ (Cricket) ను చూడని వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ వారు క్రికెట్ చూడకున్నా వాళ్లకి ఈ గేమ్ గురించి తెలిసే ఉంటుంది. అంతర్జాతీయ మ్యాచ్ అయినా ఐపీఎల్ (IPL) మ్యాచ్ అయినా గేమ్ జరుగుతుందంటే ఫ్యాన్స్ టీవీలకు అత్తుకుపోతారు. ఇక మ్యాచ్ టైమ్ వచ్చిందంటే తమ పనులను వాయిదా వేసుకోని కూడా చూస్తారు. ఇటు టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫైనల్‌కు వెళ్లడంతో మరోసారి దేశంలో క్రికెట్ ఫీవర్ అమాంతం పెరిగింది. ఇవాళ(జూన్ 29) టీమిండియా దక్షిణాఫ్రికా (South Africa) తో పైనల్ ఆడనుంది. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలని యావత్ దేశం కోరుకుంటోంది. కొందరు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రోహిత్ (Rohit Sharma), కోహ్లీ (Virat Kohli) ఫొటోలను పెట్టుకోని ప్రేయర్లు చేస్తున్నారు. భజన చేస్తూ భక్తి గీతాలు పాడుతున్నారు. మరికొన్ని చోట్ల టీమిండియా ఫొటోలకు హారతీ ఇస్తున్నారు ఫ్యాన్స్. ఇలా టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ దేవుడిని పూజిస్తున్నారు.
నిరీక్షణకు తెరదించుతారా?
గతేడాది 2023 వరల్డ్ కప్ అందినంట్లే అంది చేజారిపోవడం భారత్ ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ బాధనుంచి తేరుకోవడానికి భారత్‌కు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. 2007లో ధోనీ నాయకత్వంలో టైటిల్ విజేతగా నిలిచిన ఇండియా మరోసారి కోచ్ రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మల ఆధ్వర్యంలో రెండోసారి పొట్టి కప్‌ను ఒడిసిపట్టి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని కోరుకుంటున్నారు.
పటిష్టంగా బౌలింగ్:
ఈసారి భారత బ్యాంటింగ్ లైనప్ కొంత నిరాశపరిచినా బౌలింగ్‌లో మాత్రం అదరగొడుతోంది. కొత్త బంతితో అర్ష్‌దీప్, బుమ్రా పవర్ ప్లేలోనే కీలక వికెట్లు తీయగా.. మిడిల్ ఓవర్లో స్పిన్నర్లు, అక్షర్ పటేల్, కుల్దీప్, జడేజాలు బెటర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో భీకరమైన హిట్టర్లను సైతం తెలివిగా బురిడికొట్టించి పెవిలియన్ పంపారు. సౌతాఫ్రికాతోనూ ఫైనల్లో భారత బౌలింగ్ మరింత కీలకం కానుంది.
ఇరు జట్ల అంచనా:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్.
సౌతాఫ్రికా: మార్కరమ్ (కెప్టెన్), డికాక్, హెన్రిక్స్, క్లాసెన్, డెవిడ్ మిల్లర్, స్టబ్స్, జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నోర్టెజ్, షంషీ.
Also Read: ఫైనల్‌లో కోహ్లీని పక్కన పెట్టడం ఖాయమేనా? రోహిత్ మదిలో ఏముంది?