దక్షిణాఫ్రికాలో భారత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఈసారి అయినా టెస్ట్ సీరీస్‌ను కొట్టుకొస్తారని ఆశించారు కానీ అవి కాస్తా అడియాశలే అయ్యాయి. ఇప్పుడు కనీసం సమం అయినా చేస్తారా అని ఎదురుచూస్తున్నారు భారత క్రికెట్ అభిమానులు. ఈరోజు మధ్యాహ్నం 1.30 నుంచి ఇండియా-సౌత్ ఆఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ మొదలవనుంది. గత రెండు పర్యటనల్లో సీరీస్ రాకపోయినా కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలుచుకొచ్చింది టీమ్ ఇండియా. ఇప్పుడు కూడా అదే జరిగితే బావుంటుందని అంటున్నారు. మొదటి టెస్ట్ ఓడిపోయినా కనీసం రెండో దానిలో అయినా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ బావుండునని కోరుకుంటన్నారు ఫ్యాన్స్.
Also read:అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సెబీ దర్యాప్తులో జోక్యానికి నో చెప్పిన సుప్రీంకోర్టు
మొదటి టెస్ట్ ఓటమితో భారత్ బరిలోకి దిగుతుంటే...క్లీన్ స్వీప్ లక్ష్యంగా దక్షిణాఫ్రికా రెడీ అవుతోంది. కేప్ టైన్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇక్కడ భారత్ ఎప్పుడూ టెస్ట్ మ్యాచ్ గెలవలేదని రికార్డులు చెబుతున్నాయి. దీంతో టీమ్ ఇండియా ముందు ఇప్పుడు పెద్ద సవాలే ఉంది. మొదటి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, సెకండ్ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లి ప్రదర్శన తప్ప చెప్పుకోవడానికేమీ లేదు. యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లు ఘోరంగా విఫలం అయ్యారు. కెప్టెన్ రోహిత్ కూడా సరిగ్గా ఆడకపోవడంతో టీమ్ పై తీవ్ర ప్రభావం చూపించింది.
ఇప్పుడు ఈ మ్యాచ్ గెలవాలంటే టీమ్‌లో అందరూ సమిష్టిగా ఆడాలి. ప్రతీ ఒక్కరూ రాణించాల్పి అవసరం ఉంటుంది. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడటం జట్టుకు కలిసొచ్చే అంశం. జడేజా కోసం అశ్విన్ న్‌ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది.. అయితే ఆల్‌రౌండర్‌గా శార్దుల్ ఠాకూర్ స్థానంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. లాస్ట్ట మ్యాచ్‌లో బాగా ఆడిన కేఎల్ రాహుల్, కోహ్లీ తమ ఫామ్‌ను కొనసాగించాలి. మొదటి మ్యాచ్‌లో పైసర్ ప్రసిద్ధ కృష్ణ ఘోరంగా విఫలం అయ్యాడు. అయినా కూడా ఈ మ్యాచ్‌లో అతనని ఆడించే అవకాశం ఉంది. ఓవరాల్‌గా భారత బ్యాటింగ్ బాగానే ఉన్నా బౌలింగ్ మాత్రం మెరుగుపడాల్సిన అవసరం ఉంది.
మరోవైపు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బవుమా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. ఇతని స్థానంలో కెప్టెన్ గా ఉన్న డీన్ ఎల్గర్‌కు ఇదే చివరి టెస్ట్. అందుకే దీన్ని విజయంతో ముగించాలని ఎల్గర్ అనుకుంటున్నాడు. ఇతనితో పాటూ బెడింగామ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక బౌలర్ కొయెట్జీ స్థానంలో ఎంగిడి రానున్నాడు. మరో బౌలర్ బర్గర్ కూడా మొదటి టెస్ట్‌లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ ఆ టీమ్‌లో ఉన్న పేసర్లు భారత బ్యాట్స్మెన్‌ను ఇబ్బంది పెట్టొచ్చని అంటున్నారు.
మొదటి రోజు పిచ్ మీద పచ్చిక కనిపిస్తోంది. ఇది సీమర్లకు బాగా అనుకూలిస్తుంది. ఆ తర్వాత నుంచ బ్యాటర్లు ఈ పిచ్ మీద రాణించొచ్చు. దీన్ని బట్టి టాస్ ఎవరు గెలిస్తే వారికి మ్యాచ్ అనుకూలంగా మారే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), యశస్వి, గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, జడేజా, శార్దుల్, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్.
దక్షిణాఫ్రికా: ఎల్గర్ (కెప్టెన్ ), మార్క్‌రమ్, జోర్జి, పీటర్సన్, హమ్జా, బెడింగామ్, వెరీన్, జాన్సెన్, ఎన్‌గిడి, రబడ, బర్గర్.