Asia cup: క్రికెట్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. రేపటి ఇండియా-పాక్ మ్యాచ్ డౌటేనా? రేపు(సెప్టెంబర్ 2న) శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం మ్యాచ్‌కు ముందు 68శాతం రెయిన్ పడే అవకాశం ఉంది. ఎంతో హైప్ ఉన్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండడంతో ఫ్యాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. By Trinath 01 Sep 2023 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి India vs Pakistan match asia cup: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కి ఉండే హైప్ దేనికి ఉండదు. ఏ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు తలపడ్డా ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు. కేవలం ఇరు దేశాల అభిమానులే కాదు.. ప్రపంచక్రికెట్ అభిమానుల సైతం ఈ మ్యాచ్‌ని చూడటానికి తమ షెడ్యూల్‌ను కూడా మార్చుకుంటారు. రేపు(సెప్టెంబర్ 2) శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో హై-వోల్టేజ్ ఫైట్ జరగనుంది. అయితే ప్రస్తుతం పల్లెకెలెలో క్లౌడీ కండిషన్స్ ఉన్నాయి. వర్షం కూడా దంచికొట్టింది. రేపు మ్యాచ్‌లోనూ వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. 68శాతం వర్షం అవకాశం: గూగుల్ వెదర్ ప్రకారం, రోజంతా బలమైన క్లౌడ్ కండిషన్స్ ఉన్నాయి. గేమ్ సమయంలో 56శాతం నుంచి 78శాతం వరకు వర్షం పడే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభ దశలో (3:00 PM IST) ఉష్ణోగ్రత 92శాతం తేమతో దాదాపు 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. మరో వాతావరణ నివేదిక (MET) ప్రకారం ఆటకు ఒక గంట ముందు 68శాతం వర్షం పడే అవకావం ఉందని అంచనా వేసింది. కాబట్టి.. రెండు జట్లు తడి అవుట్‌ఫీల్డ్(Wet outfield)లో ఆడటానికి అవకాశం ఉంది. ఆగస్ట్ 31(నిన్న)న పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ సమయంలో కూడా వర్షం పడింది. గేమ్ మధ్యలో వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ మొదటి అర్ధభాగంలో తేలికపాటి జల్లులు కురిశాయి. ఇది కొన్ని నిమిషాల పాటు ఆటను నిలిపివేసింది. పల్లెకెలేలోనే ఇండియా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. టీమిండియా ఆడనున్న రెండు గ్రూప్ మ్యాచ్‌లకు పల్లెకెలే ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 2(రేపు) పాక్‌తో మ్యాచ్‌తో పాటు సెప్టెంబర్ 4న నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది. అటు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం ఫైనల్‌తో సహా ఆరు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. ఇక్కడ కూడా రెయిన్ ఎఫెక్ట్ ఉంది. ఈ లెక్క చూస్తే ఆసియా కప్ మ్యాచ్‌లలో ఎక్కువ భాగం మ్యాచ్‌లు అభిమానులు వర్షం అంతరాయాలతోనే చూడాల్సి ఉంటుంది. ఇక రేపటి ఇండియా-పాక్ మ్యాచ్‌కు స్టేడియం ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యింది. ఇక నేపాల్‌పై భారీ విజయంతో పాకిస్థాన్ ఆసియా కప్ టోర్నీని ఆరంభించింది. కప్‌లో టోర్నిలో మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో చిత్తు చేసింది. భారత్‌తో రేపు(సెప్టెంబర్ 2) జరిగే మ్యాచ్ రద్దయితే.. పాక్ జట్టు సూపర్ 4లో ఎంట్రీ ఇస్తుంది. మరోవైపు ఆసియా కప్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయనున్నట్టు సమాచారం. విరాట్ కోహ్లీని నంబర్-4 పొజిషన్‌లో ఆడించాలని టీమ్ మ్యానేజ్‌మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓపెనర్లగా రోహిత్-ఇషాన్, వన్ డౌన్‌లో గిల్‌ని ఆడించాలని.. ఎన్నో ఏళ్లుగా ఫుల్‌ఫిల్ అవ్వని నంబర్-4 పొజిషన్ బాధ్యతలను కోహ్లీ అప్పగించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ALSO READ: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ మార్పులు..కోహ్లీ వన్ డౌన్ కాదు బాసూ! #india-vs-pakistan #asia-cup-2023 #india-vs-pakistan-asia-cup #india-vs-pakistan-asia-cup-2023 #india-vs-pakistan-asia-cup-2023-weather-report #india-vs-pakistan-asia-cup-2023-venue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి