ఉదయమంతా ఉక్కపోతను తలపించే సాధారణ ఎండ.. సాయంత్రం అవ్వగానే చల్లబడే వాతావారణం.. చుట్టూ చెట్లు.. సముద్రం.. చల్లచల్లని గాలి.. ఆహ్లాదం.. వినోదం.. పార్కులు, కొండలు.. గుట్టలు.. యువత కేరింతలు.. చప్పట్లు.. అబ్బా.. విశాఖ(Vizag)లో క్రికెట్(Cricket) మ్యాచ్ అంటే ఆ ఆనందమే వేరు. మరోసారి అదే ఆనందాన్ని అస్వాదించేందుకు ఫ్యాన్స్ రెడీ ఐపోయారు. వచ్చె నెలలో మరో అంతర్జాతీయ మ్యాచ్‌కు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది.
మ్యాచ్ ఎప్పుడంటే?
మరో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కు విశాఖ హోస్టింగ్ ఇవ్వనుంది. నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ విశాఖలోనే జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఆన్‌లైన్‌లోనే టికెట్ల విక్రయాలు జరగనున్నాయి. అటు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లను విక్రయిస్తున్నట్టు సమాచారం. ఏసీఏవీడీసీఏ స్టేడియం తో పాటు స్వర్ణ భారతి స్టేడియం లో టికెట్ల విక్రయాలు జరుగుతాయి. ఈనెల 15 నుంచి ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు జరగనున్నాయి. రోజుకు 2వేల మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ఉండనుంది.
టెస్ట్ సిరీస్ షెడ్యూల్:
తొలి టెస్టు: జనవరి 25-జనవరి 29: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
రెండో టెస్టు: ఫిబ్రవరి 2-ఫిబ్రవరి 6: డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖ
మూడో టెస్టు: ఫిబ్రవరి 15-ఫిబ్రవరి 19: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్
నాలుగో టెస్టు: ఫిబ్రవరి 23-ఫిబ్రవరి 27: JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచీ
ఐదో టెస్టు: మార్చి 7-మార్చి 11: హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
Also Read: ఎముకలు కొరికే చలిలో బౌలింగ్.. బెంబేలెత్తుతున్న బౌలర్లు
WATCH: