Shubman Gill and Shreyas Iyer Flop Show : పుజారా(Pujara), రహానే(Rahane) వద్దు.. ఎందుకంటే ఏజ్ అయిపోయిందని చెబుతున్నారు. వారిలో ఇంకా ఆడే సత్తా ఉన్నా పక్కన పెట్టేశారు. ఎందుకంటే భవిష్యత్ ప్రణాళికల బూచీ చూపించారు. సరే.. మన టీమిండియా(Team India) ఫ్యూచర్ బాగుండడం కోసమేలే అని ఫ్యాన్స్ సర్ధి చెప్పుకున్నారు. వెటరన్ల ప్లేస్‌లో యువకులు నిండిపోవడంతో మురిసిపోయారు. సీన్ కట్ చేస్తే యువ రక్తం ముసలిగా కనిపిస్తోంది. ఆడలన్నా కసి, గెలవాలన్న సంకల్పం ఆ ఇద్దరిలో అసలు కనిపించడంలేదు. మరో సచిన్, మరో కోహ్లీ అంటూ క్రికెట్ కెరీర్ మొదటి నుంచే హైప్ తెచ్చుకున్న శుభమన్‌గిల్ టెస్టుల్లో ఘోరంగా ఆడుతున్నాడు. అటు శ్రేయస్ అయ్యర్‌కు బిల్డప్‌లు ఎక్కువ ఆట తక్కువ అన్నట్టుంది పరిస్థితి. అతనేంటో అతని విధానాలేంటో అంతుచిక్కడం లేదు. అయినా ఈ ఇద్దరినే ఆడిస్తోంది బీసీసీఐ.
అట్టర్ ఫ్లాప్ షో:
శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) లాస్ట్ 11 ఇన్నింగ్స్(4 , 12 , 0 ,26 ,0 , 31 ,6 , 0, 4 ,31 ,0).. చూశారు కదా.. అఫ్రిది తమ్ముడిలా ఉన్నాడు. నాలుగు గుడ్డు సున్నాలు ఉన్నాయి. ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. అత్యధిక స్కార్ 31 మాత్రమే. అటు బాడీ లాంగ్వేజ్ చూస్తే అసలు ఆడలాన్న ఇంట్రెస్టు ఉన్నట్టే అనిపించదు. అవుటైతే కనీసం బాధ పడడు.
మరోవైపు ఎంతో టాలెంట్ ఉన్నా.. టెక్నిక్ అద్భుతంగా ఉన్నా టెస్టుల్లో మాత్రం శుభమన్‌గిల్(Shubman Gill) ఫెయిల్ అవుతుండడం కలవర పెడుతోంది. గతేడాది వన్డేల్లో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన గిల్ టెస్టుల్లో మాత్రం ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. శుభమన్‌గిల్ చివరి 11 ఇన్నింగ్స్(13 ,18 ,6 ,10 ,29 ,2 , 26 ,10 ,36, 23 , 0).. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. అత్యధిక స్కోరు 36 మాత్రమే. ఇక తాజాగా ఇంగ్లండ్‌పై జరిగిన తొలి టెస్టులోనూ ఈ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. భారత్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఈ ఇద్దరూ ఉన్నారు.
Also Read: హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన టీమిండియా.. అండర్-19లో యూఎస్‌పై భారీ విజయం