IND VS AUS: పొట్టి ఫైట్‌కు విశాఖ రెడీ.. తెలుగు కుర్రాడు తిలక్‌వైపే అందరి చూపు!

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా రెడీ అయ్యింది. విశాఖ వేదికగా రేపు తొలి టీ20 జరగనుండగా అందరిచూపు తెలుగుకుర్రాడు తిలక్‌వర్మపైనే పడింది. అటు రింకూ సింగ్‌ ఎలా ఆడుతాడన్నదానిపై కూడా ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

IND VS AUS: పొట్టి ఫైట్‌కు విశాఖ రెడీ.. తెలుగు కుర్రాడు తిలక్‌వైపే అందరి చూపు!
New Update

Tilak Varma: వన్డే వరల్డ్‌కప్‌ ముగిసి మూడు రోజులైంది. ఇండియా ఓడినా ఫ్యాన్స్‌ను మాత్రం ఎంటర్‌టైన్ చేసింది. ఇక మరోసారి క్రికెట్‌ కిక్‌ ఇచ్చేందుకు మనోళ్లు రెడీ ఐపోయారు. వరల్డ్‌కప్‌ ముగిసి నాలుగు రోజులు తిరిగేసరికి మరోసారి అలరించేందుకు మెన్‌ ఇన్ బ్లూ సిద్ధమయ్యారు. రేపు(నవంబర్‌ 23)న ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌ విశాఖలో జరగనుంది. దీంతో సాగర నగరం క్రికెట్‌ మజాను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. టీ20 అంటేనే నరాలు తెగే ఉత్కంఠ.. అందులోనూ ఇరు జట్లు ఫామ్‌లో ఉండడంతో విశాఖలో క్రికెట్‌ ఫీవర్‌ పిక్స్‌కు వెళ్లింది.


అంతా జూనియర్లే:
వరల్డ్‌కప్‌ జట్టులో దాదాపు అందరూ ఈ సిరీస్‌కు రెస్ట్ తీసుకున్నారు. సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రమే వరల్డ్‌కప్‌ ఆడిన ప్లేయర్. అతనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక వైస్‌కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ ఎంపికయ్యాడు. అటు ఆస్ట్రేలియా జట్టు కూడా పలువురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. వరల్డ్‌కప్‌ ఆడిన టీమ్‌ నుంచి కూడా రేపు జరగబోయే సిరీస్‌ ఆడనున్నారు. వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో టీమిండియాపై సెంచరీతో చెలరేగిన హెడ్‌ ఈ సిరీస్‌ ఆడనున్నాడు. అటు స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, జంపా కూడా తుది జట్టులో ఉంటారు. మిగిలిన ప్లేయర్లలో వేడ్‌, టిమ్‌ డేవిడ్‌ లాంటి స్టార్లు ఉన్నారు.

తిలక్‌ వర్మవైపే అందరి చూపు:
రేపటి మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ(Tilak Varma) ఉండనున్నాడు. అందరిచూపు ప్రస్తుతం తిలకవైపే ఉంది. ఐపీఎల్‌లో ముంబైకి అద్భుతంగా ఆడిన తిలక్‌కు ఒత్తిడిలో బాగా ఆడే ప్లేయర్‌గా పేరుంది. ఓడిపోయే మ్యాచ్‌లను కూడా గెలిపించే సత్తా తిలక్ సొంతం. దీంతో విశాఖ గడ్డపై తిలక్‌ చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అటు రింకూ సింగ్‌పై కూడా అభిమానులు బొలేడు ఆశలు పెట్టుకున్నారు.

ఇండియా ప్లేయింగ్ XI(అంచనా):
రుతురాజ్ గైక్వాడ్
యశస్వి జైస్వాల్
ఇషాన్ కిషన్ (WK)
సూర్యకుమార్ యాదవ్ (C)
తిలక్ వర్మ
రింకూ సింగ్
వాషింగ్టన్ సుందర్
అక్షర్ పటేల్
అర్ష్దీప్ సింగ్
ప్రసిద్ కృష్ణ
ముఖేష్ కుమార్

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI(అంచనా)
మాథ్యూ వేడ్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్, కేన్ రిచర్డ్‌సన్/సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆడమ్ జంపా

Also Read: ఓడిపోవడానికి అదే కారణం.. వారిలో ధైర్యం లేదు.. గంభీర్‌ ఘాటు విమర్శలు!

WATCH:

#cricket #vizag #india-vs-australia #rinku-singh #tilak-varma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe