IND VS SA: టుక్‌ టుక్‌ ప్లేయర్‌కు వన్డే కెప్టెన్సీ.. ఇది కరెక్ట్ కాదు భయ్యా!

రానున్న దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మూడు ఫార్మెట్లకు మూడు వేర్వేరు కెప్టెన్లను నియమించింది బీసీసీఐ. వన్డే కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ని సెలక్ట్ చేయడం పట్ల ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దూకుడుగా వ్యవహరించే కెప్టెన్‌ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

IND VS SA: టుక్‌ టుక్‌ ప్లేయర్‌కు వన్డే కెప్టెన్సీ.. ఇది కరెక్ట్ కాదు భయ్యా!
New Update

ఈ సారి వన్డే వరల్డ్‌కప్‌(World Cup)కు ప్రిపరేషన్‌ లేదన్న విమర్శలు ఉన్నాయి. అంటే ఈ ఏడాది వరల్డ్‌కప్‌కు ముందు వరకు ప్రధాన ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వలేదు బీసీసీఐ(BCCI). సెలక్టీవ్‌గా మ్యాచ్‌లు ఆడించకుండా చిన్నాచితక సిరీస్‌లలో కూడా ఆడించి అలిసిపోయేలా చేసిందన్న టాక్‌ ఉంది. ముఖ్యంగా వరల్డ్‌కప్‌కు రెండేళ్ల ముందు నుంచి ప్రిపరేషన్‌ ఉండాలని.. బీసీసీఐ ఆ దిశగా అడుగులు వెయ్యలేదన్న ఆరోపణలు ఉన్నాయి. వచ్చే వరల్డ్‌కప్‌కు ఇలా జరగకుండా ఉండాలంటే నాలుగేళ్ల ముందు నుంచే ప్లాన్ అవసరమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగానే బీసీసీఐ పలు మార్పులుకు పూనుకుందని సమాచారం. మూడు ఫార్మెట్లలో మూడు వెర్వేరు కెప్టెన్ల ఫార్ములాను ఇప్పటికే పలు దేశాలు ఫాలో అవుతుండగా.. తాజాగా ఈ లిస్ట్‌లో ఇండియా కూడా వచ్చి చేరింది. దక్షణాఫ్రికాతో జరగనున్న టీ20, వన్డే, టెస్టు జట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను నియమించింది బీసీసీఐ.


వన్డేలకు కేఎల్ రాహుల్:
కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohit Sharma) ఎలాంటి టాలెంట్‌ ఉన్న లీడరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అతని వయసు ప్రస్తుతం 36ఏళ్లు. 2027 ప్రపంచకప్‌ నాటికి 40ఏళ్లు వస్తాయి. అప్పటివరకు రోహిత్‌ కంటిన్యూ అవ్వడం కష్టమే. అటు రోహిత్‌, కోహ్లీ ఇద్దరూ కూడా వైట్‌ బాల్‌ క్రికెట్‌కు దూరంగా ఉండాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. సెలక్టీవ్‌గా మాత్రమే వన్డేలు ఆడాలని, టీ20లు కూడా అత్యఅవసరమైన సిరీస్‌లు మాత్రమే ఆడితే సరిపోతుందని ఈ ఇద్దరూ ఓ డిసిషన్‌కి వచ్చినట్లుగా అనిపిస్తోంది. అందుకే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో టీ20 బాధ్యతలు సూర్యకుమార్‌ యాదవ్‌కి, వన్డే కెప్టెన్సీ కేఎల్‌ రాహుల్‌(KL Rahul)కి అప్పగించారు.


ఇది కరెక్టేనా?
ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ వయసు 31. వచ్చే వన్డే వరల్డ్‌కప్‌ నాటికి 35ఏళ్లు వస్తాయి. అంటే ఇప్పుడు రోహిత్ శర్మ ఎలాంటి స్థితిలో ఉన్నాడో రాహుల్‌ కూడా అదే పొజిషన్‌కి వస్తాడు. అయితే రోహిత్‌కు ఏడాదిన్నర క్రితమే టీమిండియాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అంతకముందు కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. వరల్డ్‌కప్‌ ప్రిపరేషన్‌ను రోహిత్‌ సుదీర్ఘంగా ఆలోచించకపోవడానికి ఇదే కారణం కావొచ్చు. అందుకే ఇప్పటినుంచే కేఎల్‌రాహుల్‌ని కెప్టెన్‌గా కొనసాగిస్తే వన్డే ప్రపంచకప్‌ టైమ్‌కి రాహుల్‌కు మంచి అవగాహన ఉంటుందన్న భావనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. అయితే రాహుల్‌కి కెప్టెన్సీ ఇవ్వడం కరెక్టా కాదా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాహుల్‌ వన్డేల్లో గొప్ప ఆటగాడే కానీ.. పలుసార్లు అతని డిఫెన్సివ్‌ మైండ్‌సెట్‌ మ్యాచ్‌ను ఓడిపోయేలా చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. అగ్రెసివ్‌గా ఆలోచించే కెప్టెన్‌ ఉండాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అదే సమయంలో ఒకే సమమంలో కెప్టెన్‌గా బ్యాటర్‌గా ఐపీఎల్‌లో రాహుల్‌ ఆడిన ఇన్నింగ్స్‌లను పరీశిస్తున్నారు. కెప్టెన్సీ ప్రెజరో, ఏమో కానీ ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేపట్టకముందు రాహుల్‌ చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసి భారీగా పరుగులు చేసినట్లు లెక్కలు చెబుతుండగా.. కెప్టెన్సీ వచ్చిన తర్వాత మాత్రం జట్టు అవసరాలకు తగ్గట్టుగా బ్యాటింగ్‌ చేయలేదని.. ఎక్కువగా టుక్‌ టుక్‌ మోడ్‌లోనే బ్యాటింగ్‌ చేశాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో లక్నో కెప్టెన్‌గా అతను ఆడిన స్టాట్‌ప్యాడ్‌ ఇన్నింగ్స్‌లను గుర్తు చేస్తున్నారు.

Also Read: తెలుగు కుర్రాడు ఔట్.. బరిలోకి వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఫ్లాప్‌ ప్లేయర్!

WATCH:

#india-vs-south-africa #cricket #kl-rahul #icc-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి