Team India : టీమిండియా(Team India) టెస్టు జట్టుకు ఎనలేని సేవ చేసిన ఆటగాళ్లలో పుజారా(Pujara), రహానే(Rahane) ఇద్దరూ ఉంటారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు టెస్టు జట్టులో లేరు. రీసెంట్‌గా ముగిసిన దక్షిణాఫ్రికా(South Africa) సిరీస్‌లోనూ ఈ ఇద్దరికి ప్లేస్ దక్కలేదు. గత జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇద్దరూ ఆడారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇక జనవరి 25 నుంచి ఇంగ్లండ్(England) పై ప్రారంభంకానున్న టెస్టు సిరీస్‌కూ రహానే, పుజారాను కన్సిడర్ చేయలేదు బీసీసీఐ(BCCI). యువ ఆటగాళ్లతోనే ముందుకు వెళ్లాలని తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టు చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
ఫేర్‌వెల్ టెస్టు ఆడనిస్తారా?
టీమిండియాకు సుదీర్ఘ కాలంగా సేవలందించారు రహానే, పుజారా. టెస్టుల్లో 144 ఇన్నింగ్స్‌లలో 38 యావరేజ్‌తో 5 వేలకు పైగా పరుగులు చేశాడు రహానే. ఇదేం పెద్ద యావరేజ్ కాకున్నా ఓడిపోయే మ్యాచ్‌లను గెలిపించడంలో, నిలబెట్టడంతో రహానే కృషి మరువలేనిది. అతని కెరీర్ యావరేజ్ కూడా కొద్దీ సంవత్సరాల నుంచి దిగజారుతూ వచ్చింది. అదే సమయంలో టీమిండియాలో మిగిలిన బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. అయినా రహానేనే ప్రతీసారి బలిపశువును చేశారు సెలక్టర్లు.
అటు పుజారాకు ఫెయిల్ అవుతున్నా అవకాశాలు మెండుగానే ఇచ్చారు. ఎందుకంటే ది గ్రేట్ వాల్(The Great Wall) ద్రవిడ్ తర్వాత నంబర్-3 పొజిషన్‌కు ఆ స్థాయి కాకున్నా చాలానే న్యాయం చేశాడు పుజారా. టెస్టుల్లో 176 ఇన్నింగ్స్‌లలో 43.6 యావరేజ్‌తో 7,195 పరుగులు చేశాడు పుజారా. ఓవైపు వికెట్లు పడుతున్నా, బాల్ శరీరానికి బలంగా తాకుతున్నా గోడలా నిలపడే ప్లేయర్ పుజారా. అయితే కెరీర్ అన్నది ఎప్పుడోప్పుడు ముగిసిపోక మానదు. వరుస ఫెయిల్యూర్స్ కారణంగా ఈ ఇద్దరికి ఎప్పటికైనా ఉద్వాసన పలకాల్సిందే. భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా యువ జట్టుతో భారత్ వెళ్లాలని భావిస్తోంది. అయితే ఈ ఇద్దరిని ఫేర్‌వెల్ మ్యాచ్ ఇవ్వాలని.. ఏదో ఒక సిరీస్‌లో ఒక మ్యాచ్ ఆడిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మొదటి రెండు టెస్టులకు భారత్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్ ), గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, అయ్యర్, రాహుల్(Wk), భరత్ (Wk), ధృవ్ జురెల్ (Wk), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్.
Also Read: మళ్లీ అదే స్ట్రాటజీ.. యువకులతోనే ఇంగ్లండ్‌పై బరిలోకి.. టెస్టు జట్టు ప్రకటన!
WATCH: