New Update
వేసవి కాలం సమీపిస్తుంది. ఇప్పటికే మధ్యాహ్నం పూట ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే ఈ వేసవికి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎల్‌నీనో ప్రభావంతోనే ఈసారి ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
అయితే మార్చి - మే నెలల మధ్యకాలంలో దేశంలో చాలా చోట్ల సాధారణం కన్నా కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉందని భారత వాతారణశాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర తెలిపారు. ఉత్తర, మధ్య భారత్ ప్రాంతాల్లో మార్చి నెలల అంతగా వడగాలుల తీవ్రత ఉండకపోవచ్చని అన్నారు. ఎల్‌నినో ప్రభావం వేసవి వరకు అవకాశాలున్నాయని.. వేసవి తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపారు.
ఇదిలాఉండగా.. అనుకూల వర్షపాతానికి కారణమయ్యే లా నినా పరిస్థితులు మాత్రం వర్షకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనా వేస్తోంది ఐఎండీ. దేశంలో మార్చి నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. అయితే ఉష్ణోగ్రతలు పెరగనున్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే.. అధిక వేడి వల్ల వడదెబ్బ తగిలే పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అయితే ఏప్రిల్-మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Advertisment